TCS Ayyappa Devotees: ఆదిభట్ల TCS వద్ద ఉద్రిక్తత.. అయ్యప్ప మాలతో వచ్చిన ఉద్యోగికి నో ఎంట్రీ.. హిందూ సంఘాల ఆందోళన!

ఆదిభట్ల టీసీఎస్ (TCS Ayyappa Devotees)లో అయ్యప్ప దీక్షా వస్త్రాలతో విధులకు హాజరైన ఉద్యోగిని లోపలికి అనుమతించకపోవడంతో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు ఆందోళనకు దిగాయి.

Tension at adibatla tcs office over denial of entry to employee observing ayyappa deeksha

TCS Ayyappa Devotees: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలోని ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయం వద్ద గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అయ్యప్ప స్వామి మాల ధరించి విధులకు హాజరైన ఒక ఉద్యోగిని కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది లోపలికి అనుమతించకపోవడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు(TCS Ayyappa Devotees), వివిధ హిందూ సంఘాల నేతలు టీసీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, దీక్షా వస్త్రాలతోనే సదరు ఉద్యోగిని విధుల్లోకి అనుమతించాలని డిమాండ్ చేశారు.

Gold Silver Prices Today: బంగారం కొనుగోలుదారులకు భారీ ఊరట.. మళ్లీ తగ్గిన పసిడి ధరలు.. హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే!

రెండు నెలల ముందే సమాచారం ఇచ్చానన్న ఉద్యోగి మనీష్:

టీసీఎస్‌లో గత రెండేళ్లుగా పనిచేస్తున్న మనీష్ అనే ఉద్యోగి తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను అయ్యప్ప దీక్ష చేపట్టబోతున్న విషయాన్ని రెండు నెలల ముందే కంపెనీ యాజమాన్యానికి తెలియజేశానని ఆయన పేర్కొన్నారు. “డ్రెస్ కోడ్ పాటించకపోతే లోపలికి రానివ్వమని ఈరోజు నన్ను అడ్డుకున్నారు. కానీ డ్రెస్ కోడ్ లేకుండానే ఇతరులను లోపలికి అనుమతిస్తున్నారు. నేను అయ్యప్ప దీక్ష తీసుకున్న తర్వాతే నన్ను ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదు” అని మనీష్ వాపోయారు.

ఫిర్యాదు అందలేదు.. పరిస్థితి అదుపులోనే ఉందన్న పోలీసులు:

ఈ ఘటనపై ఆదిభట్ల పోలీసు అధికారులు స్పందించారు. ఉద్యోగిని లోపలికి అనుమతించలేదన్న ఆరోపణలతో అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు టీసీఎస్ వద్ద నిరసన తెలిపాయని వారు వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటివరకు తమకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని పోలీసులు స్పష్టం చేశారు. ఉద్యోగి చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.