Sankranti Special Trains : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. ఈ రూట్లలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే..
Sankranti Special Trains : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పలు ప్రాంతాల మీదుగా స్పెషల్ రైళ్లను ప్రకటించింది.
- Harish Thanniru
- Updated on- November 25, 2026 / 08:30 AM IST
Sankranti Special Trains
Sankranti Special Trains : సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, హైదరాబాద్ నుంచి పార్వతీపురం, శ్రీకాకుళం రోడ్, నర్సాపురం తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
Also Read : Rice Price : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బియ్యం ధరలు.. కారణాలివే..!
ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..
♦ సికింద్రాబాద్- పార్వతీపురం(07009) : డిసెంబర్ 23, 30, జనవరి 6, 13, 20, 27 తేదీల్లో (ప్రతి బుధవారం) రాత్రి 7:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1:15 గంటలకు చేరుకుంటుంది.
♦ పార్వతీపురం- సికింద్రాబాద్ (07010) : డిసెంబర్ 24, 31, జనవరి 7, 14, 21, 28 తేదీల్లో (ప్రతి గురువారం) మధ్యాహ్నం 3:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:00 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, బొబ్బిలి స్టేషన్లలో ఆగుతుంది.
♦ చర్లపల్లి-నర్సాపూర్ (07013) : జనవరి 10, 12, 17, 19 తేదీల్లో (ఆది, మంగళవారాల్లో) రాత్రి 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:00 గంటలకు చేరుకుంటుంది.
♦ నర్సాపూర్ – చర్లపల్లి (07014) : జనవరి 11, 13, 18, 20 తేదీల్లో (సోమ, బుధవారాల్లో) రాత్రి 10:00 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:50 గంటలకు చేరుకుం టుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.
♦ చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ (07115) : జనవరి 7, 9, 16 తేదీల్లో (గురు, శనివారాల్లో) రాత్రి 7:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకుంటుంది.
♦ శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి (07116) : జనవరి 8, 10, 17 తేదీల్లో (శుక్ర, ఆదివారాల్లో) మధ్యాహ్నం 2:30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
♦ హైదరాబాద్ – నర్సాపూర్ (07117) : జనవరి 9, 16 తేదీల్లో (శనివారాల్లో) సాయంత్రం 6:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:00 గంటలకు చేరుకుంటుంది.
♦ నర్సాపూర్ హైదరాబాద్ (07118) : జనవరి 10, 17 తేదీల్లో (ఆదివారాల్లో) రాత్రి 8:00 గం టలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:35 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది.
