KTR Comments : వరంగల్ వేదికగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. మళ్లీ వచ్చేది కేసీఆరే!

KTR Comments : హనుమకొండ జన చైతన్య సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

KTR's Strong Counter to Revanth Reddy

  • నా గడ్డం అడ్డమొచ్చిందా.. రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
  • 500 రోజులే టైమ్.. కాంగ్రెస్ సర్కార్‌కు కేటీఆర్ డెడ్‌లైన్
  • అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డొస్తున్నారు?

KTR Comments : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల మంటలు మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనకు కౌంట్‌డౌన్ మొదలైందని, మరో 500 రోజుల్లో బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమంటూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.

కాంగ్రెస్ పాలనలో చైతన్యం లేదు :
హనుమకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జన చైతన్య సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పాలనలో సంక్షేమం లేదని, అభివృద్ధి కూడా కనిపించడం లేదని ఆయన విమర్శించారు. ప్రజా పాలన పేరుతో రాష్ట్రంలో పర్సంటేజీల పాలన సాగుతోందని ఆరోపించారు. అవినీతి, కమీషన్ల వ్యవహారాలపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు..

Read Also : CM Revanth Reddy : కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ క్లాస్.. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు పక్కా.. కోటి ఓట్లే లక్ష్యం!

రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు :
ముఖ్యంగా వరంగల్ అభివృద్ధి అంశాన్ని ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కేసీఆర్ హయాంలోనే వరంగల్‌లో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రిని నిర్మించామని, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించలేదని విమర్శించారు. వరంగల్‌కు ప్రస్తుత ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు.

ఇక ఫ్యూచర్ సిటీపై కూడా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ లేదని, వరంగల్లే అసలైన ఫ్యూచర్ సిటీగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి అభివృద్ధి చేస్తానంటే తన గడ్డం అడ్డొచ్చిందా? అంటూ వ్యాఖ్యానించారు.

మహిళలను కోటీశ్వరులను చేసే దమ్ముంటే చేసి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌కు కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచడంతో పాటు, బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందనే సంకేతాన్ని పార్టీ శ్రేణులకు ఇచ్చారు.