WhatsApp Web Users : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? ఈ ఒక్క పొరపాటుతో మీ ప్రైవసీ డేంజర్లో..
WhatsApp Web Users : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? పని పూర్తయ్యాక లాగౌట్ చేయకపోతే మీ వ్యక్తిగత చాట్స్, కాంటాక్టులు ఇతరుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. సురక్షితంగా వాట్సాప్ వెబ్ వాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి..
- Sreehari A
- Published on- November 23, 2026 / 06:35 PM IST
WhatsApp Web Users Alert
- వాట్సాప్ వెబ్ యూజర్లకు అలర్ట్..
- వాట్సాప్ వెబ్‌లో ఈ తప్పు అస్సలు చేయకండి..
- మీ వ్యక్తిగత సమాచారం గల్లంతయ్యే ప్రమాదం
WhatsApp Web Users : స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. ఆఫీసు పనులు, వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది కంప్యూటర్లలోనూ వాట్సాప్ వాడుతున్నారు. వాట్సాప్ వెబ్ ద్వారా మెసేజ్‌లు పంపడం, ఫొటోలు, ఫైల్స్ షేర్ చేయడం చాలా సులభం.
అయితే, ఇక్కడే ఓ చిన్న నిర్లక్ష్యం మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇతరుల చేతుల్లోకి వెళ్లేలా చేయొచ్చు. అదే.. పని పూర్తయ్యాక వాట్సాప్ వెబ్ నుంచి లాగౌట్ కాకపోవడం.. ఇంతకీ ఎలా వాట్సాప్ అకౌంట్ సేఫ్ గా ఉంచుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఈ విషయంపై భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలోని నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) యూజర్లను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా ఆఫీసులు, సైబర్ కేఫ్‌లు, షేర్డ్ కంప్యూటర్లు ఉపయోగించేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది..
లాగౌట్ కాకపోతే ఏమౌతుంది? :
ఒకసారి కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ లాగిన్ చేసి, పని పూర్తయ్యాక లాగౌట్ చేయకుండా వదిలేస్తే.. ఆ తర్వాత అదే కంప్యూటర్ వాడే వ్యక్తులు మీ చాట్స్ చూసే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీ అకౌంట్ నుంచే ఇతరులకు మెసేజ్‌లు పంపొచ్చు. మీ కాంటాక్టులు, గ్రూప్‌లను పరిశీలించడంతో పాటు మీ పేరుతో ఫిషింగ్ లింకులు పంపి ఇతరులను మోసం చేసే ప్రమాదం కూడా ఉంది.
Read Also : Railway Recruitment 2026 : రైల్వేలో ఉద్యోగాల జాతర.. నెలకు రూ.44,900 వరకు జీతం.. ఈ తేదీలోగా అప్లయ్ చేసుకోండి!
ఈ జాగ్రత్తలు తప్పనిసరి :
వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారీ పని పూర్తయ్యాక లాగౌట్ చేయాలి. కేవలం బ్రౌజర్ ట్యాబ్ మూసేస్తే సరిపోదు. వీలైనంత వరకు పబ్లిక్ కంప్యూటర్లలో లాగిన్ కాకపోవడమే మంచిది. తప్పనిసరి అయితే ప్రైవేట్ బ్రౌజింగ్ మోడ్ ఉపయోగించాలి.
అయితే అది కూడా పూర్తిస్థాయి ప్రొటెక్షన్ కాదని గుర్తుంచుకోవాలి. అలాగే కంప్యూటర్, బ్రౌజర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. తెలియని ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి (Settings)లో (Linked Devices) సెక్షన్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి. మీకు తెలియని డివైజ్ ఏదైనా కనిపిస్తే వెంటనే లాగౌట్ చేయండి. వాట్సాప్ వెబ్ వాడటం తప్పు కాదు. కానీ, వాడిన తర్వాత లాగౌట్ చేయడం మర్చిపోవడమే అసలు సమస్య. ఒక్క చిన్న జాగ్రత్త మీ ప్రైవసీని కాపాడుతుంది..
