WhatsApp Web Alert : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? మీ ప్రైవేట్ చాట్స్ హ్యాకర్ల చేతుల్లో పడొచ్చు.. ఈ తప్పులు చేయకండి!

WhatsApp Web Alert : వాట్సాప్ వెబ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం హెచ్చరిక జారీ చేసింది. యాక్టివ్ సెషన్లను హ్యాకర్లు దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. మీ ప్రైవేట్ చాట్స్, వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి..

WhatsApp Web Alert

  • వాట్సాప్ వెబ్ యూజర్లకు బిగ్ అలర్ట్..
  • వాట్సాప్ వెబ్‌లో చాటింగ్ చేస్తున్నారా?
  • మీ అకౌంట్‌పై హ్యాకర్ల కన్ను.. ప్రభుత్వ హెచ్చరిక

WhatsApp Web Alert : స్మార్ట్‌ఫోన్‌లోనే కాదు.. కంప్యూటర్‌లోనూ వాట్సాప్ వాడేవాళ్లు చాలామందే ఉన్నారు. ఆఫీసు పనులు, వ్యక్తిగత సంభాషణలు, ఫైళ్ల పంపడం ఇలా రకరకాల అవసరాల కోసం వాట్సాప్ వెబ్‌ను వాడుతుంటారు.

అయితే, ఇదే ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు అవకాశంగా మారే ప్రమాదం ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సైబర్ భద్రతా విభాగం వాట్సాప్ వెబ్ యూజర్లను గట్టిగా హెచ్చరించింది. ముఖ్యంగా యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది..

ఎన్‌డీటీవీ కథనం ప్రకారం.. :
ఇండియన్ సైబర్‌క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ పరిధిలో పనిచేసే నేషనల్ సైబర్‌క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ ఈ హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్‌లో ఇప్పటికే లాగిన్ అయి ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్‌ను హ్యాకర్లు తమకు అనుకూలంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని తెలిపింది..

Read Also : Car Prices Hiked : కార్ల రేట్లకు రెక్కలు.. టాటా, హ్యుందాయ్‌ నుంచి ఆడీ వరకు ధరల పెంపు.. ఎప్పటినుంచంటే?

మీ చాట్స్ మాత్రమే కాదు.. కాంటాక్ట్స్ రిస్క్ :
ఒకవేళ సైబర్ నేరగాళ్లు మీ వాట్సాప్ వెబ్ సెషన్‌ను దుర్వినియోగం చేస్తే వ్యక్తిగత మెసేజ్‌లు చదవడం, కాంటాక్ట్ లిస్టును చూడటం, గ్రూపుల వివరాలను తెలుసుకోవడం వంటి పనులు చేయగలరు. అంతేకాదు, మీరే మెసేజ్ పంపినట్లు ఇతరులకు మెసేజ్ పంపి మోసాలకు పాల్పడే ప్రమాదం కూడా ఉంది. అందుకే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యకు దారితీయొచ్చు..

ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే సేఫ్ :
వాట్సాప్ వెబ్ వాడిన తర్వాత కేవలం బ్రౌజర్ ట్యాబ్‌ను క్లోజ్ చేస్తే సరిపోదు. తప్పనిసరిగా లాగ్ అవుట్ చేయాలి. ఎప్పటికప్పుడు లింక్ చేసిన డివైజ్‌లను చెక్ చేస్తూ గుర్తు తెలియని సెషన్లు కనిపిస్తే వెంటనే లాగ్ అవుట్ చేయాలి.

అలాగే, సైబర్ కేఫ్‌లు, హోటళ్లు, పబ్లిక్ కంప్యూటర్లలో వాట్సాప్ వెబ్ ఓపెన్ చేయకపోవడమే మంచిది. ముఖ్యమైన వ్యక్తిగత వివరాలు, ఆఫీసుకు సంబంధించిన ప్రైవసీ డేటాను పబ్లిక్ సిస్టమ్‌లలో యాక్సెస్ చేయొద్దు.. వాట్సాప్ వాడటం ఎంత ముఖ్యమో.. మన అకౌంట్‌ను సేఫ్ ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. చిన్న జాగ్రత్తతో పెద్ద సైబర్ ముప్పును తప్పించుకోవచ్చు..