Upcoming Smartphones : డిసెంబర్లో స్మార్ట్ఫోన్ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones December 2026 : డిసెంబర్ 2026లో భారత్‌లో ఐక్యూ 16, ఒప్పో రెనో 17, మోటోరోలా సిగ్నేచర్ 27, వన్ ప్లస్ 16R, షావోమీ 18 ప్రో ఫోన్లు లాంచ్ కానున్నాయి. ధరలు, ఫీచర్లు, ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.
- Sreehari A
- Published on- November 27, 2026 / 05:12 PM IST
Upcoming Smartphones December 2026
- కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా?
- డిసెంబర్లో లాంచ్ కానున్న 5 స్మార్ట్ఫోన్లు
- 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ..
- ఐక్యూ, ఒప్పో, వన్ ప్లస్, షావోమీ నుంచి కొత్త మోడల్స్
Upcoming Smartphones December 2026 : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? 2026 చివరి నెల డిసెంబర్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సందడి నెలకొననుంది. కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూస్తున్న వారికి పలు ప్రముఖ బ్రాండ్లు ఆసక్తికరమైన మోడళ్లను తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
ఐక్యూ, ఒప్పో, మోటోరోలా, వన్ ప్లస్, షావోమీ సంస్థల నుంచి కొత్త ఫోన్లు భారత మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. ఇందులో భారీ బ్యాటరీలు, అద్భుతమైన కెమెరాలు, హైఎండ్ ప్రాసెసర్లు, ప్రీమియం డిస్ప్లేలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి..
ఫ్లాగ్షిప్ ఫోన్లతో గట్టి పోటీ :
ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సింది.. ఐక్యూ 16 ఫోన్ గురించే.. ఎందుకంటే వచ్చే డిసెంబర్ మూడో వారంలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ ఫ్లాగ్షిప్ చిప్సెట్, 165Hz డిస్ప్లే, 8400mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ ఫోన్ ధర రూ.90 వేలకుపైగా ఉండొచ్చని అంచనా..
మరోవైపు ఒప్పో రెనో 17, రెనో 17సీ మోడళ్లు కూడా డిసెంబర్లో రానున్నాయి. ముఖ్యంగా 8000mAh బ్యాటరీ, 50MP కెమెరాలు, 120Hz అమోల్డ్ డిస్ప్లేతో రెనో 17 ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ సిరీస్ ధరలు సుమారు రూ.50 వేల నుంచి ప్రారంభం కావచ్చని అంచనా..
మోటోరోలా సిగ్నేచర్ 27 విషయానికి వస్తే.. డిసెంబర్ 9న భారత్‌లో అధికారికంగా లాంచ్ కానుంది. 200MP టెలిఫోటో కెమెరా, 7000mAh బ్యాటరీ, 120Hz ఓఎల్ఈడీ డిస్ప్లేతో ప్రీమియం ఫోన్ కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కావచ్చు. దీని ధర రూ.1.3 లక్షల వరకు ఉండొచ్చని అంచనా..
కెమెరా, బ్యాటరీలో అదుర్స్ :
ఇక వన్ ప్లస్ 16ఆర్ కూడా డిసెంబర్ చివర్లో లేదా 2027 ప్రారంభంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో 9000mAh బ్యాటరీ, 200MP మెయిన్ కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్ స్పెషాల్ అని చెప్పొచ్చు.
అటు షావోమీ 18 ప్రో కూడా ఈ నెలలో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 200MP పెరిస్కోప్ కెమెరా, బ్యాక్ సైడ్ సెకండరీ డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో ప్రీమియం సెగ్మెంట్లో పోటీ ఇవ్వనుంది.
వచ్చే డిసెంబర్ నెలలో మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా కాకుండా ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి కూడా అద్భుతమైన ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. అయితే, లాంచ్ తేదీలు, ధరలు, ఫీచర్లలో కొన్ని మార్పులు ఉండొచ్చు.
