Upcoming Smartphones : కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా? డిసెంబర్‌లో లాంచ్ కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు.. ఫుల్ లిస్ట్ ఇదే..

Upcoming Smartphones : డిసెంబర్ 2026లో భారత్‌లో ఐక్యూ 16, ఒప్పో రెనో 17, మోటోరోలా సిగ్నేచర్ 27, షావోమీ 18 ప్రో స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నాయి. ధరలు, ఫీచర్లు, కెమెరా వివరాలివే..

Upcoming Smartphones

  • ఐక్యూ నుంచి షావోమీ వరకు అదిరిపోయే ఫోన్లు
  • 200MP కెమెరా, 8400mAh బ్యాటరీ..
  • రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు
  • ఐక్యూ 16 నుంచి షావోమీ 18 ప్రో వరకు..

Upcoming Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, డిసెంబర్ నెల వరకు ఆగితే మంచి ఫోన్లు కొనేసుకోవచ్చు.. నవంబర్‌లో వరుసగా కొత్త ఫోన్లు మార్కెట్‌లోకి రాగా.. డిసెంబర్‌లోనూ అదే జోరు కొనసాగనుంది.

ముఖ్యంగా ఐక్యూ, ఒప్పో, మోటోరోలా, షావోమీ సంస్థలు తమ కొత్త స్మార్ట్‌ఫోన్లతో భారత మార్కెట్‌లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. భారీ బ్యాటరీలు, అదిరిపోయే కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రీమియం డిస్‌ప్లేలతో రాబోతున్న ఈ ఫోన్లపై ఓసారి లుక్కేయండి..

భారీ బ్యాటరీతో ఐక్యూ 16 ఫ్లాగ్‌షిప్ ఫోన్ :
డిసెంబర్ మూడో వారంలో భారత్‌లో ఐక్యూ 16 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో 6.85 అంగుళాల 2K ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే, 165Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చని సమాచారం.. స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్‌తో పాటు 16GB వరకు ర్యామ్ లభించవచ్చని అంచనా..

Read Also : Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!

బ్యాక్ సైడ్ మూడు 50MP కెమెరాలు, 8,400mAh భారీ బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఈ ఐక్యూ ఫోన్ ధర రూ.90 వేలపైనే ఉండొచ్చు..

ఒప్పో రెనో 17 సిరీస్ :
ఒప్పో రెనో 17, రెనో 17సీ మోడళ్లను డిసెంబర్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రెనో 17లో 6.56 అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ఉండొచ్చని అంచనా. 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, మూడు 50MP రియర్ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవవచ్చు. ఈ సిరీస్ ప్రారంభ ధర సుమారు రూ.50 వేలుగా ఉండొచ్చని సమాచారం..

మోటోరోలా సిగ్నేచర్ 27 :
ఈ మోటోరోలా సిగ్నేచర్ 27 ఫోన్ డిసెంబర్ 9న భారత్‌లో లాంచ్ కానుంది. ఇందులో 6.8 అంగుళాల టండన్ ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్‌ప్లేతో పాటు 200MP టెలిఫొటో కెమెరా ఉండే అవకాశం ఉంది. స్నాప్ డ్రాగన్ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్, 16GB ర్యామ్ వంటి ఫీచర్లు కూడా ఉండొచ్చు. ఈ మోటోరోలా ఫోన్ ధర సుమారు రూ.1.3 లక్షలుగా అంచనా..

షావోమీ 18 ప్రో :
షావోమీ 18 ప్రో కూడా డిసెంబర్‌లో భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. 6.4 అంగుళాల అమోల్డ్ స్క్రీన్‌తో పాటు బ్యాక్ సైడ్ 2.7 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే ఉండొచ్చు. 200MP పెరిస్కోప్ కెమెరా, 7,000mAh బ్యాటరీ, 100W వైర్డ్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉండవచ్చని అంచనా. ధర సుమారు రూ.1.5 లక్షలుగా ఉండొచ్చు.