Samsung Galaxy Z Fold 8 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. లక్షల ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. శాంసంగ్ ఫోల్డబుల్‌పై అదిరిపోయే డీల్!

Samsung Galaxy Z Fold 8 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5Gపై విజయ్ సేల్స్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో రూ.1,84,999కే సొంతం చేసుకోవచ్చు. ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలివే..

Samsung Galaxy Z Fold 8 Ultra 5G

  • శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 అల్ట్రా 5జీపై భారీ తగ్గింపు
  • విజయ్ సేల్స్‌లో అదిరిపోయే ఆఫర్
  • 200MP కెమెరా, 5000mAh బ్యాటరీ..
  • ఏకంగా రూ.15 వేల వరకు తగ్గింపు

Samsung Galaxy Z Fold 8 Ultra 5G : ఖరీదైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, శాంసంగ్ ఫోన్‌పై ఈ ఆఫర్ మళ్లీ దొరకదు.. ప్రీమియం ఫీచర్లు, భారీ డిస్‌ప్లే, అదిరిపోయే కెమెరా సెటప్‌తో ఆకట్టుకునే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 8 అల్ట్రా 5జీపై విజయ్ సేల్స్ స్పెషల్ డిస్కౌంట్లు అందిస్తోంది. దీనికి బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. తద్వారా శాంసంగ్ మడతబెట్టే ఫోన్ ధర మరింత తగ్గుతోంది. ముఖ్యంగా ఖరీదైన ఫోల్డబుల్ ఫోన్ కొనాలనుకుంటే ఈ డీల్ అసలు వదులుకోవద్దు..

శాంసంగ్ ఫోన్ ధర ఎంతంటే? :
ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.1,99,999 కాగా, ప్రస్తుతం రూ.1,94,999కు లభిస్తోంది. అంటే.. రూ.5,000 తగ్గింపుతో ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇంకా అదనంగా ఇండస్‌ఇండ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో 10 శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. గరిష్ఠంగా రూ.10వేల వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని ఆఫర్లు వర్తిస్తే.. శాంసంగ్ ఫోన్ ధర రూ.1,84,999కు లభిస్తుంది. మొత్తంగా ప్రారంభ ధరతో పోలిస్తే దాదాపు రూ.15వేలు ఆదా అవుతుంది.

Read Also : Vivo Y05s Launch : తక్కువ బడ్జెట్‌లో వివో కొత్త ఫోన్ వస్తోందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ధర ఎంత ఉండొచ్చంటే?

ఫోన్ ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? :
ఈ ఫోల్డబుల్ ఫోన్‌లో 8 అంగుళాల అమోల్డ్ ఇన్నర్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉన్నాయి. 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్‌పై కంటెంట్ చూడటం, గేమ్స్ ఆడుకోవచ్చు.. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్‌తో రన్ అవుతుంది.

కెమెరాల విషయానికి వస్తే..
200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. 5000mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్ బెస్ట్.. అయితే, కొనే ముందు విజయ్ సేల్స్‌లో ఆఫర్ నిబంధనలు, బ్యాంక్ డిస్కౌంట్ అర్హతలపై ఓసారి చెక్ చేయడం బెటర్..