Samsung Galaxy S27 Ultra : శాంసంగ్ ఫ్యాన్స్‌కు పండగే.. భారీ బ్యాటరీతో గెలాక్సీ S27 అల్ట్రా ఫోన్ వస్తోంది.. ఫీచర్లు లీక్..!

Samsung Galaxy S27 Ultra : శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా ఫోన్ 60W ఫాస్ట్ ఛార్జింగ్, 5,700mAh బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది. 2027 లాంచ్, కొత్త వేరియంట్లు, లేటెస్ట్ లీకుల పూర్తి వివరాలివే..

Samsung Galaxy S27 Ultra

  • 60W ఛార్జింగ్‌తోనే శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా..
  • ఛార్జింగ్ స్పీడ్ అదే.. బ్యాటరీ మాత్రం పెద్దది
  • 5,700mAh బ్యాటరీ, సర్టిఫికేషన్‌లో కీలక విషయాలు లీక్

Samsung Galaxy S27 Ultra : స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా గెలాక్సీ అల్ట్రా సిరీస్ కోసం చాలామంది టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఇప్పుడు త్వరలో రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా లభించిన సర్టిఫికేషన్ వివరాల్లో ఈ ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యంతో పాటు వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి రానున్న మోడళ్ల గురించి కొన్ని సంకేతాలు ఇచ్చాయి..

60W ఫాస్ట్ ఛార్జింగ్.. :
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రాలో తాజాగా యూఎల్ సొల్యుషన్స్ సీబీ సర్టిఫికేషన్ పొందినట్లు సమాచారం. నవంబర్ 17, 2026 తేదీతో ఉన్న ఈ సర్టిఫికేషన్‌లో 20V, 3A DC ఛార్జింగ్ వివరాలు రిజిస్టరయ్యాయి. అంటే.. ఈ శాంసంగ్ ఫోన్ గరిష్టంగా 60W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే, గత మోడల్‌తో పోలిస్తే ఛార్జింగ్ స్పీడ్‌లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది.

Read Also : EPFO New Update 2026 : ఇక పీఎఫ్ డబ్బుల కోసం నో వెయిటింగ్.. UPIతోనే నేరుగా డబ్బులు తీసుకోవచ్చు!

5,700mAh బ్యాటరీతో రాబోతోందా? :
బ్యాటరీ అనేది ఎక్కువగా వినిపిస్తోంది.. గతంలో నివేదికల ప్రకారం గెలాక్సీ ఎస్27 అల్ట్రాలో 5,534mAh బ్యాటరీ ఉండవచ్చని అంచనా. సాధారణ మార్కెటింగ్ లెక్కల్లో ఇది సుమారు 5,700mAh బ్యాటరీగా చెప్పొచ్చు. ప్రస్తుతం గెలాక్సీ ఎస్26 అల్ట్రాలో ఉన్న 5,000mAh బ్యాటరీతో పోలిస్తే చాలా బెటర్ అప్‌గ్రేడ్ అవుతుంది. దీనివల్ల ఫోన్ బ్యాటరీ బ్యాకప్ మరింత పెరిగే అవకాశం ఉంది.

పలు దేశాల్లో స్పెషల్ వేరియంట్లు :
ఈ ఫోన్ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో వేర్వేరు మోడల్ నంబర్లతో వచ్చే అవకాశం ఉంది. SM-S958B, SM-S958B/DS గ్లోబల్ వేరియంట్లుగా, అమెరికా, చైనా, కెనడా, దక్షిణ కొరియా, జపాన్ మార్కెట్లకు ప్రత్యేక వెర్షన్లు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

లాంచ్ ఎప్పుడంటే? :
శాంసంగ్ గెలాక్సీ ఎస్27 అల్ట్రా 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా.. అయితే, కెమెరా, డిస్‌ప్లే, ప్రాసెసర్ వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇవన్నీ లీకులు, సర్టిఫికేషన్ ఆధారంగా వస్తున్న సమాచారమే. శాంసంగ్ అధికారిక ప్రకటన వచ్చే వరకు పూర్తి స్పెసిఫికేషన్లపై క్లారిటీ ఉండదు..