Samsung Galaxy A Series : వారెవ్వా.. శాంసంగ్ నుంచి 2 కొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు, ధరలు లీక్.. లాంచ్ ఎప్పుడో తెలుసా?
Samsung Galaxy A Series : శాంసంగ్ గెలాక్సీ A58 5జీ, శాంసంగ్ గెలాక్సీ A38 5జీ ఫోన్ల ఫీచర్లు, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, అంచనా ధరలు, మార్చి 2027 లాంచ్ వివరాలపై ఓసారి లుక్కేయండి..
- Sreehari A
- Updated on- November 27, 2026 / 11:10 AM IST
Samsung Galaxy A Series
- శాంసంగ్ గెలాక్సీ A58, A38 వచ్చేస్తున్నాయ్..
- 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో కొత్త ఫోన్లు
- మార్చి 2027లో శాంసంగ్ కొత్త 5G ఫోన్లు.. ఫీచర్లు లీక్
Samsung Galaxy A Series : కొత్త శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీకో గుడ్ న్యూస్.. అతి త్వరలోనే మార్కెట్లోకి మరో 2 కొత్త 5G స్మార్ట్ఫోన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ A58 5జీ, గెలాక్సీ A38 5జీ పేర్లతో రాబోతున్నాయి.
ఈ శాంసంగ్ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ప్రాసెసర్, ధర వివరాలు ఇప్పటికే ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz అమోల్డ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఆసక్తి పెంచుతున్నాయి..
శాంసంగ్ గెలాక్సీ A38 5జీ ఫీచర్లు :
ముందుగా గెలాక్సీ A38 5జీ విషయానికి వస్తే.. ఈ ఫోన్లో 6.7 అంగుళాల FHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్ప్లే ఉండొచ్చని సమాచారం. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Bank of India Akshay FD : BOI బంపర్ ఆఫర్.. 500 రోజుల FDతో అదిరిపోయే వడ్డీ.. రూ.5 లక్షలకు ఎంతొస్తుందంటే?
మీడియాటెక్ డైమన్షిటీ 7500 ప్రాసెసర్‌తో పాటు 6GB ర్యామ్ అందించే అవకాశం ఉంది. కెమెరాల విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ OIS సపోర్ట్‌తో 50MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 12MP సెల్ఫీ కెమెరా ఉండొచ్చని అంచనా..
శాంసంగ్ గెలాక్సీ A58 5జీ ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ A58 5జీ మరింత ప్రీమియం లుక్‌తో రానుంది. ఇందులో మెటల్ ఫ్రేమ్ ఉండొచ్చని లీకులు చెబుతున్నాయి. గెలాక్సీ A38 తరహాలోనే 6.7 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉండొచ్చు. ఎక్సినోస్ 1680 చిప్సెట్, ఎక్స్‌క్లిప్స్ 550 జీపీయూ, 8GB ర్యామ్ ఈ ఫోన్లో ఉండొచ్చు..
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. బ్యాక్ సైడ్ 50MP OIS మెయిన్ కెమెరా, 12MP అల్ట్రావైడ్, 5MP మాక్రో కెమెరాలు ఉండొచ్చు. సెల్ఫీల కోసం 12MP కెమెరా కూడా ఉండనుంది.
బ్యాటరీ, ధర, లాంచ్ ఎప్పుడంటే? :
ఈ రెండు ఫోన్లలోనూ 6000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్, IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉండొచ్చని అంచనా. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9.5తో రావచ్చని అంచనా.
లాంచ్ విషయానికి వస్తే.. 2027 మార్చిలో ఈ శాంసంగ్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అమెరికాలో గెలాక్సీ A38 ధర సుమారు 539 డాలర్లు, గెలాక్సీ A58 ధర 649 డాలర్లుగా ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ A38 ధర రూ.50 వేల నుంచి రూ.60 వేల మధ్య ఉండొచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ A58 ధర రూ.70 వేల లోపు ఉండొచ్చని అంచనా.
