iQOO 16 India Launch : గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ 16 కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

iQOO 16 India Launch : భారత మార్కెట్లో ఐక్యూ 16 త్వరలో లాంచ్ కానుంది. 8400mAh బ్యాటరీ, 165Hz అమోల్డ్ డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ల వివరాలపై ఓసారి లుక్కేయండి..

iQOO 16 India Launch

  • ఐక్యూ కొత్త ఫోన్‌పై భారీ అంచనాలు
  • 8400mAh బ్యాటరీతో పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్
  • 165Hz డిస్‌ప్లే, మూడు 50MP కెమెరాలు
  • త్వరలో భారత్‌లో ఐక్యూ 16 లాంచ్

iQOO 16 India Launch : స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ ఫోన్ల మధ్య పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో వచ్చే ఫోన్లకు డిమాండ్ బాగానే ఉంది.

ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐక్యూ (iQOO) మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.. అదే ఐక్యూ 16 ఫోన్.. ఇప్పటికే చైనా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఫోన్ త్వరలోనే భారత్‌లో అడుగుపెట్టనుందనే వార్తలు టెక్ ప్రియుల్లో ఆసక్తి పెంచింది..

వచ్చే నెలలోనే భారత్‌లోకి? :
రెక్టింగులర్ కెమెరా మాడ్యూల్‌తో 3 రియర్ కెమెరాలు ఉండనున్నాయి. రాబోయే ఐక్యూ 16 కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఐక్యూ ఇండియా సీఈఓ నిపున్ మరియా కూడా ఈ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో లాంచ్ కానుందని గతంలో వెల్లడించారు..

Read Also : Samsung Galaxy Z Fold 8 Ultra 5G : ఇది కదా డిస్కౌంట్.. లక్షల ఫోన్ ఇప్పుడు తక్కువ ధరకే.. శాంసంగ్ ఫోల్డబుల్‌పై అదిరిపోయే డీల్!

డిస్‌ప్లే, ప్రాసెసర్ అదుర్స్ :
చైనా వేరియంట్ వివరాలు చూస్తే.. ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల 2K+ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, వీడియోలు చూడొచ్చు.. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 5 ప్రాసెసర్, అడ్రెనో జీపీయూ ఉన్నాయి. గేమింగ్ ఇష్టపడేవారికి ఇది మంచి ఆప్షన్‌..

50MP ట్రిపుల్ కెమెరాలు.. భారీ బ్యాటరీ :
ఫొటోగ్రఫీ కోసం బ్యాక్ సైడ్ మూడు 50MP కెమెరాలు అమర్చారు. ఇందులో OIS సపోర్టు, మెయిన్ కెమెరాతో పాటు అల్ట్రా వైడ్, 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ 32MP కెమెరా అందించారు.

ఈ ఫోన్‌లో మరో మెయిన్ అట్రాక్షన్.. 8,400mAh భారీ బ్యాటరీ.. 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 40W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అయితే, భారత మార్కెట్లోకి వచ్చే వేరియంట్‌లో ఇవే ఫీచర్లు ఉంటాయా? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలపై కంపెనీ నుంచి క్లారిటీ లేదు.. లాంచ్ తర్వాతే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.