iQOO 15R Price Drop : రూ. 77,999 ఫోన్ ఇప్పుడు రూ. 59,999కే.. ఐక్యూ 15Rపై అమెజాన్ అదిరిపోయే ఆఫర్..
iQOO 15R Price Drop : ఐక్యూ 15ఆర్‌పై అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 7600mAh బ్యాటరీ, 12GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు, ధర, బ్యాంక్ ఆఫర్ల వివరాలివే..
- Sreehari A
- Published on- November 29, 2026 / 06:51 PM IST
iQOO 15R Price Drop
- రూ. 3,350 అదనపు డిస్కౌంట్‌తో ఐక్యూ 15R లభిస్తోంది
- 7600mAh బ్యాటరీ, 12GB RAMతో అదిరిపోయే డీల్
- 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు
iQOO 15R Price Drop : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? ముఖ్యంగా మంచి బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ పెర్ఫార్మెన్స్, గేమింగ్ ఫీచర్లు ఉన్న ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, ఐక్యూ 15Rపై ఓ లుక్కేయండి. అమెజాన్‌లో ఈ ఫోన్‌పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పటికే తగ్గిన ధరకు అదనంగా బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్‌లో ఐక్యూ 15R ధర ఎంతంటే? :
ఐక్యూ15R అసలు ధర రూ.77,999గా ఉంది. అయితే, అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.59,999కే లభిస్తుంది. అంటే ప్రారంభ ధరతో పోలిస్తే రూ.18వేలు తగ్గింది. దీనికి తోడు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో రూ.3,350 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అయితే, ఈ బ్యాంక్ ఆఫర్‌కు సంబంధించిన నిబంధనలు, అర్హతలను కొనుగోలు చేసే ముందు చెక్ చేసుకోవడం మంచిది..
ఐక్యూ 15ఆర్ ఫీచర్లు ఇవే :
ఈ ఫోన్‌లో 6.59 అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లే ఇచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ ఉండటంతో వీడియోలు, గేమ్స్ ఆడుకోవచ్చు. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్ ఇందులో ఉంది. దీనికి 12GB LPDDR5x ర్యామ్, 512GB స్టోరేజ్ అందించారు. ప్రత్యేకమైన Q2 గేమింగ్ చిప్ కూడా ఉండటంతో గేమింగ్ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్..
ఈ ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే మరో ఫీచర్ 7,600mAh భారీ బ్యాటరీ. దీనికి 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇక కెమెరాల విషయానికొస్తే.. OISతో కూడిన 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
IP68+, IP69 రేటింగ్స్‌తో వాటర్, డస్ట్ నుంచి ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. భారీ బ్యాటరీ, పవర్‌ఫుల్ ప్రాసెసర్, మంచి డిస్‌ప్లే కోరుకునేవారికి ఐక్యూ 15ఆర్ ఆసక్తికరమైన డీల్ అని చెప్పొచ్చు. కొనుగోలు చేసే ముందు అమెజాన్‌లో లేటెస్ట్ ధర, బ్యాంక్ ఆఫర్లను ఓసారి చెక్ చేయండి.
