Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!

Instagram Reels Smart TV : ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ యాప్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్ టీవీల్లో రీల్స్ ఎలా చూడాలి? ఏ డివైజ్‌లకు సపోర్ట్ చేస్తుంది? పూర్తి వివరాలివే..

Instagram Reels Smart TV

  • ఇన్‌స్టా యూజర్లకు మెటా అదిరిపోయే గుడ్‌న్యూస్‌..
  • ఫోన్‌లోనే కాదు.. ఇక టీవీలోనూ ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌
  • టీవీ ఆన్ చేస్తే చాలు.. ఇన్‌స్టా రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే

Instagram Reels Smart TV : స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటారా? అయితే మీకు మెటా ఓ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు మొబైల్ స్క్రీన్‌కే పరిమితమైన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను ఇకపై ఇంట్లోని టీవీలోనూ పెద్ద స్క్రీన్‌పై చూడొచ్చు.. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్‌స్టాగ్రామ్ ఫర్ టీవీ’ యాప్‌ను తీసుకొస్తోంది. త్వరలోనే ఈ సేవలను భారత్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది..

అమెరికాలో ఫస్ట్.. భారత్ ఎప్పుడంటే? :
ఇప్పటికే అమెరికాలోని కొన్ని అమెజాన్ ఫైర్ టీవీ డివైజ్‌లలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా భారత్‌లోనూ తీసుకురావాలనే నిర్ణయంతో ఇన్‌స్టా ప్రియుల్లో ఆసక్తి పెరిగింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే ఫోన్ చేతిలో పట్టుకొని రీల్స్ చూడాల్సిన అవసరం ఉండదు. టీవీ రిమోట్‌తోనే నచ్చిన వీడియోలను ఎంచుకోవచ్చు. అంతేకాదు.. ఒకదాని తర్వాత మరొకటి రీల్స్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంటాయి..

Read Also : BRS Delimitation Bill : డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ గ్రీన్ సిగ్నల్.. కేటీఆర్ పెట్టిన కండిషన్ ఇదే!

గరిష్టంగా 5 ఖాతాలు :
ప్రస్తుతం ఈ యాప్ ఆపిల్ టీవీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ డివైజ్‌లకు సపోర్ట్ చేయనుంది. టీవీలో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సైన్ ఇన్ అయితే సరిపోతుంది. ఒక టీవీపై గరిష్ఠంగా 5 ఇన్‌స్టా ఖాతాలను వాడుకోవచ్చు. పర్సనల్ అకౌంట్లను టీవీకి కనెక్ట్ చేయడం ఇష్టం లేనివారు ప్రత్యేకంగా కొత్త ఖాతాను కూడా క్రియేట్ చేసుకోవచ్చు..

స్పెషల్ ఛానెల్స్ కూడా :
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. యూజర్ల అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేక ఛానెల్స్‌ను కూడా అందించనుంది. నచ్చిన క్రియేటర్ల వీడియోలు, ప్రొఫైల్స్‌ను ఈజీగా చూడొచ్చు. ఫోన్‌లో చూస్తున్న రీల్‌ను నేరుగా టీవీకి పంపేలా ‘క్యాస్ట్ వీడియోస్’ ఆప్షన్ కూడా ఉంది. ఇందుకోసం ఫోన్, టీవీ రెండూ ఒకే వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

మొత్తానికి చిన్న స్క్రీన్‌పై చూసే రీల్స్‌ను పెద్ద తెరపై కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించే అవకాశం రానుంది. అయితే, భారత్‌లో ఈ యాప్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందో క్లారిటీ లేదు.. అప్పటివరకూ ఆగాల్సిందే..