Vaibhav Sooryavanshi : డబుల్ సెంచరీ తరువాత.. వైభవ్ సూర్యవంశీ చెప్పిన మాటలివే.. అనుకున్నదొకటి.. అయిందొకటి..!

Vaibhav Sooryavanshi : కేవలం 53 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తిచేసి సరికొత్త రికార్డులను నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ తరువాత మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు.

Vaibhav Sooryavanshi

Vaibhav Sooryavanshi : రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ వన్డే టోర్నీలో భారత్ -ఎ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. మంగళవారం గ్రూప్-బి మ్యాచ్‌లో తిలక్ వర్మ సారథ్యంలోని భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో యూఏఈని చిత్తుగా ఓడించింది. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ 53 బంతుల్లోనే 204 పరుగులు చేసి సరికొత్త రికార్డులను నమోదు చేశాడు. దీంతో యూఏఈ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని 14.2 ఓవర్లలోనే భారత్ -ఎ జట్లు కంప్లీట్ చేసింది.

Also Read : Vaibhav Sooryavanshi : 53 బంతుల్లో 204 రన్స్.. వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డులివే..

కేవలం 53 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తిచేసి సరికొత్త రికార్డులను నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీ.. మ్యాచ్ తరువాత మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. గత రెండు ఇన్నింగ్స్‌లలో భారీ స్కోర్లు చేయలేకపోయా. దీంతో యూఏఈతో మ్యాచ్‌లో మొదట క్రీజులో కొంత సమయం గడపాలని నిర్ణయించుకున్నా. ఒకట్రెండు బంతులు ఆడాక.. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలమని అర్ధమైంది. దీంతో స్వేచ్ఛగా బ్యాటిగ్ చేశాను. సెమీస్, ఫైనల్లోనూ ఇదే జోరు కొనసాగించాలని అనుకుంటున్నానంటూ సూర్యవంశీ పేర్కొన్నాడు.

బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తన దృష్టి మొత్తం ఆటపైనే ఉంది. ఎన్ని పరుగులు చేయాలి? ఏ రికార్డు బద్దలు కొట్టాలి? అనే ఆలోచనలు తనకు రాలేదని సూర్యవంశీ చెప్పాడు. మ్యాచ్‌ను ఎక్కువసేపు క్రీజులో ఉండి ఆడాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు. ఒకవేళ మ్యాచ్ తన నియంత్రణలో లేకపోతే నిదానంగా ఆడుతూ పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేసేవాడినని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్‌లో త్వరగానే పరిస్థితులను తన ఆధీనంలోకి తీసుకోగలిగానని, అందుకే తనదైన శైలిలో ఆడినట్లు వివరించాడు.

బ్యాటింగ్ చేసే సమయంలో ఒత్తిడి ఉండదా..? అన్న ప్రశ్నకు వైభవ్ ఆసక్తికరంగా స్పందించాడు. బ్యాటింగ్ చేసేటప్పుడు కొంత ఒత్తిడి, భయం ఉండటం సహజమే. అయితే రెండు నుంచి నాలుగు బంతులు ఆడిన తర్వాత కుదురుకుని సాధారణ స్థితికి వస్తానని వైభవ్ వివరించాడు.

తన కోచ్ రిషి సర్ ప్రతి మ్యాచ్‌కు ముందు ఒకే విషయాన్ని చెబుతుంటారని వైభవ్ వెల్లడించాడు. బంతిని జాగ్రత్తగా గమనిస్తూ ఆడితే ఆట సులభమవుతుందని సూచిస్తారని చెప్పాడు. అండర్-19 రోజుల నుంచి కోచ్ ఇదే సలహా ఇస్తున్నారని తెలిపాడు.

యూఏఈతో మ్యాచ్‌లో తన ఆట మళ్లీ గాడిలో పడటం సంతోషంగా ఉందని వైభవ్ చెప్పాడు. ఇదే ఫామ్‌ను టోర్నీలో మిగిలిన మ్యాచుల్లోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. సెమీఫైనల్లో గెలిచి ఫైనల్‌కు చేరుకోవడమే తమ లక్ష్యమని వైభవ్ సూర్యవంశీ స్పష్టం చేశాడు.