Vaibhav Sooryavanshi : 53 బంతుల్లో 204 రన్స్.. వైభవ్ సూర్యవంశీ బ్రేక్ చేసిన రికార్డులివే..
Vaibhav Sooryavanshi Records : దోహాలో యూఏఈతో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగి 53 బంతుల్లోనే 204 పరుగులు చేశాడు. ఈ క్రమంలో పలు కొత్త రికార్డులను నమోదు చేశాడు.
Vaibhav Sooryavanshi
Vaibhav Sooryavanshi Records : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎవరి నోట విన్న ఒక్కటే పేరు వినిపిస్తోంది.. అతడే భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ -2026 టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్ వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి సిక్సర్ల మోత మోగించాడు. గతంలో ఏ క్రికెటర్‌కు సాధ్యంకాని రీతిలో కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ (204) పూర్తి చేసి రికార్డుల మోత మోగించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధ్యమనుకున్న రికార్డులను సుసాధ్యం చేస్తూ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాక.. వైభవ్ తన దూకుడైన బ్యాటింగ్ తో పలు రికార్డులను నమోదు చేశాడు.
Also Read : Vaibhav Sooryavanshi : బ్యాట్ పట్టుకుంటే బాదుడే.. వైభవ్ 204 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్ వీడియో చూశారా?
దోహాలో నవంబర్ 24న యూఏఈతో జరిగిన రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు తరఫున వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఆరంభం నుంచే దూకుడైన ఆటతో అదిరిపోయే శుభారంభాన్ని అందించాడు. మైదానం అన్నివైపులా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కేవలం 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. ఆ తర్వాత మరింత దూకుడు పెంచి కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంతటితో ఆగకుండా కేవలం 40 బంతుల్లోనే 150 పరుగుల మార్కును అందుకున్నాడు. అనంతరం మరో 12 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసి మొత్తం 53 బంతుల్లో 204 పరుగులు (28 సిక్సులు, 7 ఫోర్లు) పూర్తి చేసి క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేశాడు.
వైభవ్ సూర్యవంశీ సాధించిన ఈ డబుల్ సెంచరీతో గతంలో న్యూజిలాండ్ ఆటగాడు చాడ్ బోవ్స్ పేరిట ఉన్న రికార్డు కనుమరుగైంది. చాడ్ బోవ్స్ 103 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించగా.. వైభవ్ ఏకంగా 52 బంతుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో వైభవ్ 28 సిక్సులు బాదాడు. దీంతో పురుషుల లిస్ట్-ఏ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా ఆటగాడు డార్సీ షార్ట్ పేరిట ఉన్న 23 సిక్సర్ల రికార్డును అధిగమించాడు. భారత ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఒక లిస్ట్-ఏ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు గతంలో రోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరూ 16 సిక్సర్లు బాదగా.. వైభవ్ ఆ రికార్డును కూడా తిరగరాశాడు.
