Team India : భారత్ కొంపముంచిన న్యూజిలాండ్‌తో తొలి టెస్టు డ్రా.. డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా ఫైనల్ చేరుకోవాలంటే ఇలా జరగాల్సిందే?
Team India : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
- Thota Vamshi Kumar
- Published on- November 23, 2026 / 04:48 PM IST
Team India WTC 2027 Final Qualification Scenario after 1st test draw Against New Zealand
Team India : వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 ఫైనల్‌కు అర్హత సాధించాలన్న టీమ్ఇండియా ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులు చేయగా.. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 720 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 352 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను త్వరగా ఆలౌట్ చేసి ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని భారత్ భావించింది. అయితే.. కివీస్ ఆటగాళ్లు డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఐదో రోజు ఆఖరికి కివీస్ 239/5 స్కోరుకే పరిమితమైంది. దీంతో భారత్ డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
పాయింట్ల కోత..
న్యూజిలాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో పాయింట్ల శాతం 51.52 నుంచి 50 శాతానికి పడిపోయింది. ఈ సైకిల్లో భారత్ 12 మ్యాచ్‌లు ఆడగా.. ఐదు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మరో మూడు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ప్రస్తుతం భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు న్యూజిలాండ్ కూడా పాయింట్ల పట్టికలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు పాయింట్ల శాతం 72.22 నుంచి 66.67 శాతానికి తగ్గింది.
భారత్ ఫైనల్ చేరుకోవాలంటే..?
డబ్ల్యూటీసీ (2025-27) సైకిల్లో భారత్ ఇంకా ఆరు టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో ఒకటి న్యూజిలాండ్‌తో కాగా.. మరో ఐదు ఆస్ట్రేలియాతో స్వదేశంలో ఆడనుంది. ఈ ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్ విజయం సాధిస్తే.. ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా డబ్ల్యూటీసీ 2025-27 ఫైనల్‌కు చేరుకుంటుంది. అలా కాకుండా ఒక్క మ్యాచ్‌లో ఓడిపోయినా, లేదంటే డ్రాగా ముగిసినా కూడా మిగిలిన జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ (2025-27 ) పాయింట్ల పట్టికలో దక్షిణాప్రికా, ఆస్ట్రేలియాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.
