Punjab Kings : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం.. ఏరి కోరీ.. రాహుల్ ద్రవిడ్‌తో పనిచేసిన వ్యక్తిని..
Punjab Kings : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
- Thota Vamshi Kumar
- Updated on- November 25, 2026 / 06:30 PM IST
Paras Mhambrey as Punjab Kings fast bowling coach for the 2027
Punjab Kings : ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత మాజీ బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేను తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
54 ఏళ్ల పరాస్ మాంబ్రే ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టును వీడి పంజాబ్ కింగ్స్‌లో చేరారు. ఈ నియామకంతో పంజాబ్ జట్టు కోచింగ్ విభాగంలో మరో కీలక స్థానం భర్తీ అయినట్లయింది. ఇప్పటికే ఫాస్ట్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్, ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్ జట్టును వీడగా.. స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే భారత పురుషుల జట్టులో అదే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
కాగా.. ప్రస్తుత పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌తో మాంబ్రే మరోసారి పని చేయనున్నారు. గతంలో వీరిద్దరు ముంబై ఇండియన్స్‌లో కలిసి పని చేశారు.
అంతర్జాతీయ క్రికెట్లో మంచి అనుభవం..
అంతర్జాతీయ క్రికెట్లో పరాస్ మాంబ్రేకు మంచి అనుభవం ఉంది. 2021 నుంచి 2024 వరకు రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. అతడి పదవీకాలంలోనే భారత జట్టు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. ఆ తరువాత వెస్టిండీస్‌లో జరిగిన 2024 టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2024తోనే అతడి పదవీకాలం ముగిసింది. టీమ్ఇండియా బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత అతడు ముంబై ఇండియన్స్ కోచింగ్ బృందంలో మరోసారి చేరాడు. గత నెలలో ముంబై కోచింగ్ సిబ్బందిలో మార్పులు చేయడంతో అతడు జట్టును వీడాడు.
ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ ట్రోఫీని నెగ్గలేదు. రెండు సార్లు ఫైనల్‌కు చేరుకున్నా కూడా నిరాశే ఎదురైంది. 2014లో కేకేఆర్, 2025లో ఆర్సీబీ జట్లు పంజాబ్‌ను దెబ్బతీశాయి.
