IND A vs UAE : శతకంతో చెలరేగిన యూఏఈ బ్యాటర్.. కీలక మ్యాచ్‌లో భారత్ లక్ష్యం ఎంతంటే?
IND A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహా వేదికగా భారత్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ మంచి స్కోరును సాధించింది.
- Thota Vamshi Kumar
- Updated on- November 24, 2026 / 03:37 PM IST
Asia Cup Rising Stars 2026 IND A vs UAE Match Team India Target is 250
IND A vs UAE : ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భాగంగా దోహా వేదికగా భారత్-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో యూఏఈ మంచి స్కోరును సాధించింది. హర్‌ప్రీత్ సింగ్ భాటియా (130; 144 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది.
మిగిలిన యూఏఈ బ్యాటర్లలో బాసిల్ హమీద్ (36 నాటౌట్; 36 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), ముహమ్మద్ షాహ్దాద్ (28; 46 బంతుల్లో 2 ఫోర్లు), ఈథన్ డిసౌజా (25; 37 బంతుల్లో 2 ఫోర్లు) మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు.
మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలో అర్షద్ ఖాన్ నాలుగు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హర్ష్ దూబె, షాబాజ్ అహ్మద్, సూర్యాన్ష్ షెడ్గే లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
