Motorcycle Diarys : నాగ‌వంశీ సినిమా… నిర్మాత‌గా మారిన క‌న్న‌డ హీరో..

Motorcycle Diarys : సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ‘మోటార్‌సైకిల్ డైరీస్’ పేరుతో ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నాయి.

Rishab Shetty Naga Vamsi Announce New Film Motorcycle Diarys

Motorcycle Diarys : తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, రిషబ్ శెట్టి ఫిల్మ్స్ సంయుక్తంగా ‘మోటార్‌సైకిల్ డైరీస్’ పేరుతో ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. రిషబ్ శెట్టి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సాధారణ కథలకు భిన్నంగా ప్రయాణం నేపథ్యంలో సాగే భావోద్వేగ కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. జీవితంలో ఎదురయ్యే అనుకోని సంఘటనలు, కొత్త పరిచయాలు, మధురమైన జ్ఞాపకాలు, మనిషిలో వచ్చే మార్పులను ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే ప్రయాణం మాత్రమే కాకుండా, మనసుకు దగ్గరయ్యే అనుభవాల సమాహారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Aishwarya Rajesh : పింక్ శారీలో ముద్దుగా.. ఐశ్వ‌ర్య రాజేష్ ఫోటోలు వైర‌ల్‌..

ఈ చిత్రానికి శివా చిరంతన దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, ప్రగతి రిషబ్ శెట్టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. భువన్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. నవీన్ నూలి ఎడిటర్‌గా, ధరణి గంగెపుత్ర ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందులో నటించనున్న నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.