Gold Price Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ తెలంగాణలో తులం గోల్డ్ రేటు ఎంతంటే?
Gold Price Today : బంగారం కొనేవాళ్లకు బిగ్ అలర్ట్. గోల్డ్ రేటులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.
- Harish Thanniru
- Published on- November 27, 2026 / 10:16 AM IST
బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా? అయితే, మీకు బిగ్ షాకింగ్ న్యూస్. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు.. మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. బుధవారం గోల్డ్ రేటు తగ్గగా.. గురు, శుక్రవారాల్లో బంగారం ధర భారీగా పెరిగింది.
శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.1750 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 1600 పెరిగింది. మరోవైపు.. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 65 డాలర్లు పెరగ్గా.. ప్రస్తుతం అక్కడ ఔన్సుగ గోల్డ్ 3,631 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 5వేలు పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో (మేకింగ్ ఛార్జి, జీఎస్టీ కాకుండా) 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,26,550 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,16,000 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,26,600 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,16,150 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,26,550కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,16,000 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,60,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,60,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
