Gold Silver Prices Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో తులం రేటు ఎంతంటే?
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ ఊరట. మళ్లీ గోల్డ్ రేటు తగ్గింది.
- Harish Thanniru
- Published on- November 22, 2026 / 12:50 PM IST
Gold Silver Prices Today : బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రోజురోజుకు గోల్డ్ రేటు తగ్గుతూ వస్తోంది. గడిచిన వారం రోజులుగా 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై సుమారు రూ.13వేలకుపైగా తగ్గుదల చోటు చేసుకుంటుంది.
ఆదివారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 3,881 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,44,292 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,32,260 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,465 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,32,433 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,44,292కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,32,260 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.1,75,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.1,75,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.1,75,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
