Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు.. సుప్రీమ్ కోర్ట్ తీవ్ర ఆగ్రహం!

తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం(Karthigai Deepam Row) వివాదంలో ఆదేశాలు అమలు చేయని తమిళనాడు సీఎస్, డీజీపీ, కలెక్టర్, ధర్మకర్తలకు సుప్రీంకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

Supreme court issues contempt notices to tn officials over thiruparankundram karthigai deepam row

Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైన తమిళనాడు ప్రభుత్వ అధికారులపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్, డీజీపీ, మదురై కలెక్టర్, ఆలయ ధర్మకర్తలకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రాజకీయ పెద్దల సూచనల మేరకు అధికారులు వ్యవహరించారనే ఆరోపణలపైనా స్పందించిన ధర్మాసనం, తదుపరి విచారణకు సీఎస్ వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ధర్మకర్తలు అనుమతి ఇవ్వలేదని కలెక్టర్ ఇచ్చిన వివరణ, క్షమాపణలతో కోర్టు సంతృప్తి చెందకుండా, కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది.

MP Laxman: తెలంగాణ ఎన్నికలు 2029లోనే.. ఐదు నెలల రాష్ట్రపతి పాలనపై చర్చ.. ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు!

సీఆర్‌పీఎఫ్ భద్రత.. రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకం:

తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న ఆలయం(Karthigai Deepam Row), దర్గా భద్రతను కేంద్ర రిజర్వ్ పోలీసు దళం సీఆర్‌పీఎఫ్‌కు అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ధర్మకర్తల మండలిని సస్పెండ్ చేసి, నిర్వహణ పర్యవేక్షణ బాధ్యతలను రిటైర్డ్ న్యాయమూర్తులను రిసీవర్లుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ధర్మకర్తలు అనుమతించలేదనే కారణంతో సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కనపెట్టడం కుదరదని తేల్చి చెబుతూ కఠిన చర్యలకు ఉపక్రమించింది.

నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపానికి ఆదేశం:

నవంబర్ 28న దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించేందుకు మరోసారి అవకాశం కల్పిస్తూ ఆ కార్యక్రమం జరిగేలా కొత్త రిసీవర్లు చూడాలని ధర్మాసనం ఆదేశించింది.
ఆలయ అధికారులు, సంబంధిత యంత్రాంగం సుప్రీంకోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కోర్టు ఉత్తర్వుల అమలుపై ఎలాంటి బేరసారాలకు తావులేదని, శనివారం కొండపై దీపత్తూన్ వద్ద దీపం వెలగించాల్సిందేనని ధర్మాసనం తేల్చి చెప్పింది.