Sabarimala Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్–కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లు.. జనవరి నుంచి ప్రతి వారం!

శబరిమల భక్తుల రద్దీ దృష్ట్యా జనవరిలో హైదరాబాద్–కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లను(Sabarimala Special Trains) దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Hyderabad to kollam special trains sabarimala devotees scr schedule january

Sabarimala Special Trains: శబరిమల మహా మండల, మకరవిళక్కు పూజల నేపథ్యంలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్, పరిసర ప్రాంతాల నుంచి కేరళకు వెళ్లే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి, రెగ్యులర్ రైళ్లలో రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి మాసంలో భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్ అధికారికంగా ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, జనవరి 2 నుంచి 23 వరకు ప్రతి శనివారం రాత్రి 11.10 గంటలకు (07193) ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి కొల్లాంకు బయల్దేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 4 నుంచి 25 వరకు ప్రతి సోమవారం ఉదయం 10.55 గంటలకు (07194) కొల్లాం నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు. భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందస్తు రిజర్వేషన్లతో సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

Ap Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్.. విపత్తుల సంస్థ కీలక హెచ్చరిక!

ఈ స్టేషన్లలో హాల్ట్.. భక్తులకు భారీ ఊరట:

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల మీదుగా సాగే ఈ ప్రత్యేక రైళ్లకు మార్గమధ్యంలో అనేక ప్రధాన స్టేషన్లలో స్టాపేజీలు కల్పించారు. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, ఎర్నాకుళం, కొట్టాయం వంటి ముఖ్య స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయని అధికారులు తెలిపారు. తిరుపతి, ఎర్నాకుళం, కొట్టాయం మీదుగా వెళ్లడం వల్ల శబరిమలకు వెళ్లే భక్తులకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుందని, ప్రయాణ కష్టాలు గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు.