Parliament Session: నవంబర్ 30 నుంచే పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ? మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన!

100 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లోక్‌సభ, రాజ్యసభను(Parliament Session) తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించినట్లు మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.

Centre decides to reconvene both houses of parliament lok sabha nov 30

Parliament Session: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటూ పార్లమెంట్ ఉభయ సభలను తిరిగి సమావేశపరచాలని సంకల్పించింది. లోక్‌సభను నవంబర్ 30న, రాజ్యసభను డిసెంబర్ 2న ప్రారంభించాలని స్పీకర్, చైర్మన్‌ను కోరినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. అవసరమైన ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణ కోసమే ఈ భేటీ నిర్వహిస్తున్నామని, పనితీరును బట్టి డిసెంబర్ 3న ముగించే అవకాశం ఉందని వెల్లడించారు. 2026 ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన సభలను అధికారికంగా ముగించకపోవడంతో, ఇవే వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. నవంబర్ 21 నాటికి 100 రోజుల విరామం పూర్తి కావడంతో, 2008లోని 87 రోజుల రికార్డును ఈ విరామం అధిగమించింది.

Nandi Awards: నంది అవార్డులకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. నవంబర్‌లో విజేతల జాబితా, డిసెంబర్‌లో ఘనంగా వేడుక!

కీలక బిల్లులపై ఊహాగానాలు.. గత ఓటింగ్‌లో వీగిపోయిన బిల్లు:

ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను(Parliament Session) కేంద్రం మళ్లీ ప్రవేశపెట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఏ బిల్లులు తెస్తారనే విషయంపై కిరణ్ రిజిజు స్పష్టత ఇవ్వలేదు. జనగణనతో సంబంధం లేకుండా పునర్విభజన, మహిళా రిజర్వేషన్ వేగంగా అమలు చేసే రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్ 17న లోక్‌సభలో వీగిపోయింది. ఏప్రిల్ 16-18 ప్రత్యేక సమావేశాల్లో జరిగిన ఓటింగ్‌లో 528 మంది సభ్యుల్లో 298 మంది అనుకూలంగా, 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. రెండింట మూడొంతుల మెజారిటీకి 54 ఓట్ల లోటుతో బిల్లు ఆగిపోయింది. అనంతరం డీలిమిటేషన్ బిల్లు 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2026లను వాయిదా వేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు.

లోక్‌సభ సీట్ల పెంపు ప్రతిపాదన.. దక్షిణాది ఆందోళనలు:

ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్యను గరిష్టంగా 850 వరకు పెంచాలని కేంద్రం యోచిస్తోంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సీట్లు పెరిగితే జాతీయ స్థాయిలో తమ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళన ఆయా రాష్ట్రాల్లో నెలకొంది. ప్రతి రాష్ట్రంలో సీట్లను 50 శాతం పెంచడం లేదా ప్రస్తుత నిష్పత్తిని యథాతథంగా ఉంచి పెంచే ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది.

1971 జనాభా లెక్కలు.. మహిళా రిజర్వేషన్ నిబంధన:

ప్రస్తుతం 1971 జనాభా లెక్కల ఆధారంగానే సీట్ల కేటాయింపు కొనసాగుతోంది. సీట్ల పెంపుపై కేంద్రం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం కొత్త జనగణన పూర్తయిన తర్వాతే అమల్లోకి రానుంది.