The Sesso Trailer : ‘ది సెస్సో’ ట్రైలర్ రిలీజ్.. ఈ బోల్డ్ ట్రైలర్ చూశారా..?
మీరు కూడా ది సెస్సో బోల్డ్ ట్రైలర్ చూసేయండి.. (The Sesso Trailer)
- Saketh U
- Published on- November 17, 2026 / 03:00 PM IST
The Sesso Trailer
The Sesso Trailer : యశ్ రాజ్, మౌపియ గౌస్వామి మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా ది సెస్సో. గ్రేస్ గ్రిట్ ఫిల్మ్స్ బ్యానర్ పై బి.ఎన్.రవి నిర్మాణంలో యశ్ రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈశ్వర్ పెంటి, పూజా రెడ్డి.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్‌కి హీరో ఆకాష్ జగన్నాథ్ గెస్ట్ గా రాగా మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, అశోక్ యాదవ్, ప్రభు రావులకోలు, నర్సింగ్, శ్రావణ్ రావులకోలు.. పలువురు హాజరయ్యారు.
మీరు కూడా ది సెస్సో బోల్డ్ ట్రైలర్ చూసేయండి..
Also See : Aadhya : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసిన పవన్ కళ్యాణ్ కూతురు.. ఆద్య లేటెస్ట్ ఫొటోలు వైరల్..
ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆకాశ్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ట్రైలర్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీలో హీరో, హీరోయిన్ చాలా బాగున్నారు. ఈ టీం మరిన్ని సినిమాలు తీయాలి, ఈ సినిమా హిట్ అవ్వాలి అని అన్నారు. దర్శకుడు, హీరో యశ్ రాజ్ మాట్లాడుతూ.. సినిమా లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కానీ ఆ అందమైన జీవితం వెనకాల చాలా ఇబ్బందులు ఉంటాయి. సొసైటీ గురించి నాకు వచ్చిన ఆలోచన ఈ సినిమాకు బీజం వేసింది. ఈ మూవీ బేసిక్ హ్యూమన్ ఎమోషన్ నుంచి పుట్టిందే. ఓవర్‌నైట్ స్టార్ అవ్వాలని ఇండస్ట్రీకి రాలేదు. ఇండస్ట్రీకి వచ్చాక చాలా నేర్చుకున్నాను అని తెలిపారు.
గండిపేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్ యాదవ్ మాట్లాడుతూ.. సినిమా తీయడం అంటే మాములు విషయం కాదు. కనిపించడానికి 3 గంటల సినిమా. కానీ దీని వెనుక మూడు వందల రోజుల కష్టం ఉంటుంది. ఎంతో కష్టపడితేనేగాని హీరో అవ్వలేరు. కష్టం విలువ నాకు తెలుసు. అందుకే నేను ఇంత వరకు వచ్చాను. ఈసారి జరిగే ఈవెంట్‌కు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌ను, శ్రీశైలం యాదవ్‌ను తీసుకువస్తాను అని అన్నారు. నిర్మాత బి.ఎన్ రెడ్డి మాట్లాడుతూ.. మేము ఇంత దూరం రావడానికి ఎంతో కష్టపడ్డాం. మా టీమ్ అంతా చాలా కష్టపడి ఈ సినిమా తీశాం అని అన్నారు.
