Ram Charan : మళ్ళీ శరీరంపై ఫోకస్ చేసిన రామ్ చరణ్.. సినిమా పాత్ర కోసం కష్టం..

రామ్ చరణ్ ప్రతి సినిమాకు తన శరీరం, హెయిర్ స్టైల్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. (Ram Charan)

  • Published on- November 21, 2026 / 09:38 AM IST

Ram Charan

Ram Charan : మన హీరోలు సినిమా కోసం ఎంతైనా కష్టపడతారు. కొంతమంది మాత్రం బాడీ డబల్, డూపులు వాడతారు రిస్కీ సీన్స్ కోసం. కొంతమంది హీరోలు సినిమా కోసం తమని తాము ఎలాగైనా మార్చుకుంటారు. మరికొంతమంది హీరోలు ఎలా ఉన్నా అలాగే కనిపిస్తారు ప్రతి కథలోనూ. సినిమా పాత్ర కోసం ఎలా కావాలంటే అలా మారే హీరోలలో రామ్ చరణ్ ఒకరు.

రామ్ చరణ్ ప్రతి సినిమాకు తన శరీరం, హెయిర్ స్టైల్ లో వేరియేషన్స్ చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రంగస్థలం నుంచి ప్రతి పాటకు వైవిధ్యం చూపిస్తున్నాడు. పెద్ది సినిమాలో అయితే ఒక ప్లేయర్ లా తన ఫిజిక్ ని చాలా మార్చుకొని ధృడమైన శరీరాన్ని తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో అనేక గాయాలపాలయినా చికిత్స తీసుకొని మళ్ళీ తన శరీరంపై ఫోకస్ పెట్టాడు. అయితే ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాకు కూడా మళ్ళీ తన శరీర ఆకృతిని మారుస్తున్నాడట.

Also Read : Samantha : సమంతకు మొదట కొడుకే పుడతాడు.. 12 ఏళ్ళ క్రితమే జోస్యం..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా RC17 ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలు కానుంది. దీంతో ఈ గ్యాప్ లో రామ్ చరణ్ సుకుమార్ చెప్పినట్టు RC17 లోని తన పాత్ర కోసం కష్టపడుతున్నాడట. తన బాడీని కొంత మార్చడానికి ఓ పర్సనల్ ట్రైనర్ తో శిక్షణ మొదలుపెట్టారట. నెల రోజుల్లో ఆ పాత్రకు తగ్గట్టు మారాలని కష్టపడుతున్నాడట రామ్ చరణ్.

దీంతో మరోసారి రామ్ చరణ్ ని అభినందిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు. ఎన్ని గాయాలు అయినా సినిమా పాత్ర కోసం, ఫ్యాన్స్ ని మెప్పించడం కోసం కఠోర శ్రమ పడుతున్నాడు రామ్ చరణ్.