Rayavalasa : రాయవలస సినిమా నుంచి ఈ మెలోడీ లవ్ సాంగ్ విన్నారా..?

Rayavalasa : కార్తీక్, శ్రీష నులు జంటగా తెరకెక్కిన సినిమా రాయవలస.

Neetho Oo Adugu Melody song from Rayavalasa

Rayavalasa : కార్తీక్, శ్రీష నులు జంటగా తెరకెక్కిన సినిమా రాయవలస. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో రాధిక జయంతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాకు కార్తీక్ హీరోగా, రచయితగా, సింగర్‌గా కూడా పనిచేసాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, టీజర్ , సాంగ్స్ రాగా తాజాగా మరో కొత్త లవ్ మెలోడీ సాంగ్ ని రిలీజ్ చేసారు.

‘నీతో ఓ అడుగు..’ అంటూ సాగే ఈ పాటను అర్జున్ బాల సంగీత దర్శకత్వంలో కార్తీక్ రాయగా కార్తీక్, రమ్య బెహరా కలిసి పాడారు. బీచ్ నేపథ్యంలో రొమాంటిక్ లవ్ సాంగ్ గా ఈ సాంగ్ ఉండబోతుంది. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కుతున్న రాయవలస సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో రిలీజ్ కానుంది.

Sri Satya : చెవిలో పువ్వుతో శ్రీ స‌త్య‌.. ఎంత క్యూట్‌గా ఉందో.. ఫోటోలు..

మీరు కూడా ఈ లవ్ మెలోడీ సాంగ్ వినేయండి..