Allu Arjun : గ్యాప్ రాకుండా బన్నీ సరికొత్త ప్లాన్!
Allu Arjun : ఆర్య టు అలా వైకుంఠపురం వరకు.. పరుగు నుంచి పుష్ప వరకు అల్లుఅర్జున్ రూటే సెపరేటు.
- Thota Vamshi Kumar
- Published on- November 27, 2026 / 09:58 AM IST
Iconic Star Allu Arjun Plan For Movies Selection
Allu Arjun : ఆర్య టు అలా వైకుంఠపురం వరకు.. పరుగు నుంచి పుష్ప వరకు అల్లుఅర్జున్ రూటే సెపరేటు. కొన్ని సినిమాలను షార్ట్ టర్మ్‌లో పూర్తి చేస్తే.. ఇంకొన్ని సినిమాలకు మాత్రం టైమ్ తీసుకున్నారు. పుష్ప ఫ్రాంచైజీకి దాదాపు ఆరేళ్ల సమయం కేటాయించాడు. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాకా కూడా భారీస్థాయిలో రూపొందుతోంది.
దీంతో ఈ సారి తన తదుపరి సినిమాల విషయంలో ఎక్కువ సమయం తీసుకోకూడదని బన్నీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సినిమాల ఎంపిక, నిర్మాణ సమయాల విషయంలో కొత్త ప్రణాళికతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన టాక్ వినిపిస్తోంది. ఒక సినిమా పూర్తయ్యేలోపు మరో సినిమా కోసం ఎక్కువ గ్యాప్ రాకుండా, కథల ఎంపిక నుంచి షూటింగ్ షెడ్యూల్స్ వరకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారట.
Gnaneswari Kandregula : అందమైన రోజులు.. పార్ట్ టైమర్స్ సిరీస్ ఫేమ్ జ్ఞానేశ్వరి కాండ్రేగుల ఫోటోలు..
బన్నీ..లోకేష్ కనగరాజ్, బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు 2027లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని సమాచారం. ముఖ్యంగా లోకేశ్, బాసిల్ ఇద్దరూ తమదైన శైలిలో సినిమాలను తెరకెక్కించే దర్శకులు కావడంతో పాటు, మూవీస్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే అభిప్రాయం ఉంది. ఈ సినిమాల షూటింగ్స్‌ను అనుకున్న సమయంలో పూర్తి చేసి, వరుసగా మూవీస్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది అల్లుఅర్జున్ కొత్త ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. నిజంగానే బన్నీ తన సినిమాల విషయంలో స్పీడ్ పెంచుతారో లేదో చూడాలి మరి.
