Chandrabose : చంద్రబోస్ కూతుర్ని చూశారా.. మొదటిసారి సినిమా ఈవెంట్లో.. తరుణ్ భాస్కర్ కోసం వచ్చి..
ఈ నగరానికి ఏమైంది 2 సక్సెస్ ఈవెంట్లో లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ..(Chandrabose)
- Saketh U
- Published on- November 25, 2026 / 07:53 AM IST
Chandrabose
Chandrabose : సినిమా సెలబ్రిటీల పిల్లలు సినిమా వాళ్ళను కలవడం ఈజీనే. వాళ్ళను కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకోవడం షరా మాములే. కానీ తాజాగా ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ తన కూతురుని పరిచయం చేస్తూ ఈ నగరానికి ఏమైంది 2 ఈవెంట్లో మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
ఈ నగరానికి ఏమైంది 2 సక్సెస్ ఈవెంట్లో లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. నా కూతురు పేరు అమృత వర్షిణి. తను సైబర్ సెక్యూరిటీలో బిటెక్ ఫైనల్ ఇయర్ CBIT కాలేజీలో చదువుతుంది. తను ఎపుడూ సినిమాల గురించి, సెలబ్రిటీల గురించి ఏమి అడగదు. ఎప్పుడూ అడగలేదు. కానీ చాన్నాళ్లుగా తను ఒకటే అడుగుతుంది. తరుణ్ గారితో ఫోటో అని. కానీ నేను తరుణ్ తో పని చేయలేదు. వెళ్లి అడగడం నాకు నామోషీ అని చెప్పాను. పని చేస్తే తీసుకెళ్తాను అని చెప్తూ వచ్చాను. ఇవాళ పని చేసే సందర్భం వచ్చింది. పని చేశాను, విజయం సాధించాము. అందుకే ఫోటో కోసం తనను తీసుకొచ్చాను. మీరు ఒక పిక్ ఇవ్వాలి అని తరుణ్ తో అన్నారు.
దాంతో చంద్రబోస్ కూతురు స్టేజిపైకి రాగా, తరుణ్ భాస్కర్ పైకి వెళ్లి ఫోటో ఇచ్చాడు. అమృత వర్షిణితో తరుణ్ భాస్కర్ మొదట సెల్ఫీ దిగగా తర్వాత ముగ్గురూ కలిసి ఫోటో దిగారు. చంద్రబోస్.. తను సినిమా చూసి టెన్ కి టెన్ అని చెప్పింది అని తెలిపాడు. దీంతో చంద్రబోస్ కూతురు వైరల్ గా మారింది.
