Bigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. వర్షిణి సింపతీ డ్రామా.. రామకృష్ణ ఓవర్ యాక్షన్.. డే 82 ఫుల్ ఎపిసోడ్..
రామకృష్ణ, శివ, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్, రామ్ ప్రసాద్ కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ అందరూ..(Bigg Boss New Captain)
- Saketh U
- Published on- November 27, 2026 / 10:56 PM IST
Bigg Boss New Captain
Bigg Boss New Captain : బయట నుంచి గెస్టులు వచ్చి కంటెస్టెంట్స్ తో కలిసి టాస్కులు ఆడటం జరిగింది గత మూడు రోజులుగా. దీంతో రామకృష్ణ, శివ, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్ లు కెప్టెన్సీ టాస్కు కంటెండర్లుగా నిలిచారు. గెలవని మిగతా వాళ్లకు ఒక అవకాశం ఇస్తాను అన్నాడు బిగ్ బాస్. అది గెలిస్తే కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు అని చెప్పారు. కానీ మిగతా ఐదుగురిలో నలుగురే ఉండాలి అని చెప్పాడు. దీంతో వర్షిణి, ముకేశ్, రామ్ ప్రసాద్, వంశీ , త్రిగున్ లు చర్చ మొదలుపెట్టారు. వర్షిణి ఆడతాను అనడంతో త్రిగున్ వద్దన్నాడు. వాదన జరిగింది. ముకేశ్ ఒక్కడే వర్షిణి ఆడాలి అన్నాడు. మిగతా అందరూ వద్దు అన్నారు.
త్రిగున్ వెళ్లి మిగతా వాళ్ళతో మీటింగ్ పెట్టడంతో వర్షిణి, ముకేశ్ త్రిగున్ గురించి నెగిటివ్ గా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు పాత సంఘటనలు తీసుకొచ్చి. ముకేశ్ – వర్షిణి గురించి తెలిసిందే. వాళ్ళు ఒక్కరు ఒకవైపు అందరూ వేరే వైపు అని మాట్లాడుకున్నారు. త్రిగున్ మిగతా వాళ్లందరితో కూర్చొని మాట్లాడుతుంటే ముకేశ్ – వర్షిణి తెగ ఫీల్ అయిపోయి ముకేశ్ వెళ్లి మధ్యలో నన్నెందుకు పిలవరు అని గొడవ పెట్టుకున్నాడు. వర్షిణి కెమెరాతో నన్ను, ముకేశ్ ని టార్గెట్ చేస్తున్నాడు అని సింపతీ ట్రై చేసింది. వర్షిణి ఆడాలా వద్దా అని అందరూ తెగ చర్చలు జరిపారు.
Also Read : Vijay Sethupathi : సీఎం విజయ్ ని ఒక నటుడిగానే చూస్తాను.. రాజకీయాలపై విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్..
సడెన్ గా వర్షిణి తనని క్యారెక్టర్ లెస్ అని త్రిగున్ అన్న పాత గొడవ ఇప్పుడు సంబంధం లేకపోయినా తీసుకొచ్చి, ఆల్రెడీ సారీ చెప్పినా త్రిగున్ సారీ చెప్పలేదని వర్షిణి గొడవ పెట్టుకుంది. ఎప్పుడో అయిపోయినదానికి వర్షిణి ఏడుస్తూ సింపతీకి బాగానే ట్రై చేసింది. త్రిగున్ మాట్లాడుతున్నా వినకుండా వర్షిణి ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఇక ముకేశ్ కూడా ఆమె వెనకాలే ఓదార్చడానికి వెళ్ళాడు. అందరూ త్రిగున్ కి సపోర్ట్ చేస్తుండటంతో వర్షిణి తట్టుకోలేక ముకేశ్ ఇంకా ఎక్కించడంతో ఎవరూ ఆమె తప్పు ఉన్నా సరే ఒక ఆడపిల్లకి సపోర్ట్ చేయట్లేదు అని ఏడుస్తూ అందరి మీద అరిచింది. దాంతో అందరూ షాక్ అయ్యారు. వర్షిణి ఏదో పాయింట్ ఏటో తిప్పేయడంతో త్రిగున్ కూడా ఎమోషనల్ అయ్యాడు. అన్ని వాదనలు అయ్యాక ముకేశ్, రామ్ ప్రసాద్, వంశీ, త్రిగున్ లు టాస్క్ కి ఎంపిక అయ్యారు.
పేపర్స్ మీద సంతకం పెట్టి ఆ పేపర్స్ బోర్డు కి అతికించాలి. ఎవరు ఎక్కువ అతికిస్తే వాళ్ళు కెప్టెన్సీ టాస్క్ కి వెళ్తారు అని ప్రకటించాడు బిగ్ బాస్. అందరూ ఆడుతూ అతికించగా మధ్యలో ముకేశ్ త్రిగున్ అంటించిన స్టిక్కర్స్ చింపేసాడు, పాపం తన గేమ్ ఆడకుండా తను గెలవకపోయినా పర్లేదు త్రిగున్ ఓడిపోవాలి అని భయంతో ముకేశ్ ఆడుతున్నాడు. దీంతో వంశీ, రామ్ ప్రసాద్ స్టిక్కర్స్ మాత్రం ఉన్నాయి. రామ్ ప్రసాద్ ఎక్కువ పెట్టడంతో కెప్టెన్సీ టాస్క్ కి సెలక్టయ్యాడు.
Also See : Anchor Charmilla : చీరకట్టులో క్యూట్ గా టాలీవుడ్ ట్రెండింగ్ యాంకర్.. చర్మిల ఫొటోలు..
రామకృష్ణ, శివ, దేబ్జానీ, అమన్, నరేష్, సుధీర్, రామ్ ప్రసాద్ కెప్టెన్సీ రేసులో ఉన్న ఈ అందరూ కెప్టెన్సీ రేసులో లేని వాళ్ళని సపోర్ట్ చేయమని అడిగారు. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ గురించి చెప్పారు. పైనుంచి బాల్స్ పడతాయి. రేసులో లేని వాళ్ళు బుట్టలతో పట్టుకొని వాళ్లకు నచ్చిన వారి బాక్స్ లో వేయొచ్చు. కెప్టెన్సీ రేసులో ఉన్నవాళ్లు వాళ్ళ బాక్స్ లోవి కాపాడుకుంటూ వేరే వాళ్ళవి దొంగతనం చేయొచ్చు. రౌండ్ రౌండ్ కి ఎవరి బాక్స్ లో తక్కువ బాల్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చివరికి ఎవరు ఉంటె వాళ్ళు కెప్టెన్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. చాలా మంది దేబ్జానికి వేస్తుండటంతో రామకృష్ణ , శివ దేబ్జానీవి తీసేయడని ట్రై చేసారు. దీంతో అందరి మధ్య గొడవ అయింది. శివ, రామ్ ప్రసాద్ ఒకర్ని ఒకరు పట్టుకొని పడిపోయారు. మొదటి రౌండ్ లో శివ ఎలిమినేట్ అయ్యాడు. నెక్స్ట్ శివ సంచాలక్ అయ్యాడు. శివ తనకు నచ్చిన రూల్స్ పెట్టాడు.
ఈ రౌండ్ లో రామకృష్ణ, రామ్ ప్రసాద్ కలిసి ఫిజికల్ లేకుండా ఆడదాం అన్నారు. అందరూ ఓకే అన్నారు కానీ త్రిగున్ మధ్యలో వచ్చి అమన్ వి తీసేయడంతో అమన్ అందరి బాల్స్ తీసేసాడు. నెక్స్ట్ అమన్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే త్రిగున్ ని డిస్ క్వాలిఫై చేసాడు శివ. బిగ్ బాస్ కూడా ఓకే అన్నాడు. నెక్స్ట్ రౌండ్ లో అమన్ కూడా బాక్స్ లు తీసేసాడు. ముకేశ్ సుధీర్ బాక్స్ తీసేయడానికి ట్రై చేసాడు. ఈ రౌండ్ లో సుధీర్ ఎలిమినేట్ అయ్యాడు. దీంతో సుధీర్ ముకేశ్ ని తీసేసి త్రిగున్ ని తీసుకుంటా అన్నాడు. ముకేశ్ గొడవ పడ్డాడు అలా ఎలా తీసేస్తావు అని. బిగ్ బాస్ సుధీర్ కి సపోర్ట్ చేసాడు. దాంతో గేమ్ లోకి త్రిగున్ ఎంటర్ అయ్యాడు. ఈ రౌండ్ లో అందరూ దేబ్జానీకి సపోర్ట్ చేసి ఆమె దాంట్లో వేశారు. దాంతో రామ్ ప్రసాద్, నరేష్ ఎలిమినేట్ అయ్యారు. రామ్ ప్రసాద్ సంచాలక్ అయ్యాడు. రామ్ ప్రసాద్.. శివ, అమన్, సుధీర్ లు ఫౌల్ ఆడారని డిస్మిస్ చేసారు.
Also See : Miheeka Daggubati : ఫ్రెండ్స్‌తో చిల్ అవుతున్న రానా భార్య.. మిహీక దగ్గుబాటి ఫొటోలు వైరల్..
ఫైనల్ రౌండ్ లో రామకృష్ణ, దేబ్జానీ మిగిలారు. అందరూ దేబ్జానికే వేస్తారని రామకృష్ణకు భయం పట్టుకొని ఇందాక ఫిజికల్ వద్దు అన్నవాడు ఇప్పుడేమో ఫిజికల్ కావాలి అని, దేబ్జానీవి లాక్కుందామని ప్లాన్ వేసాడు. అయితే సంచాలక్ గా రామ ప్రసాద్ ఫిజికల్ వద్దు అనడంతో రామకృష్ణ గొడవ పడ్డాడు. తానే ఇందాక ఫిజికల్ వద్దు అని ఇప్పుడు తన దాగరకు వచ్చేసరికి ఫిజికల్ కావాలని రామకృష్ణ కాసేపు ఓవర్ యాక్షన్ చేసాడు. ఈ మధ్యలో శివ వచ్చి కెప్టెన్ ఎవరు అవుతారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. వాళ్ళ గ్యాంగ్ ఎక్కువ ఉంది అన్నాడు.
ఫిజికల్ ఆడితే మాత్రం డిస్ క్వాలిఫై చేస్తా అన్నాడు రామ్ ప్రసాద్. లాస్ట్ రౌండ్ లో అందరూ బాల్స్ దేబ్జానీ, రామకృష్ణకు పంచినా చివర్లో రామకృష్ణ వచ్చి దేబ్జానీ బాల్స్ తీసీయడంతో చెప్పినట్టే రామ ప్రసాద్ బాల్స్ లెక్కపెట్టకుండానే దేబ్జానీ గెలిచినట్టు అనౌన్స్ చేసాడు. దాంతో దేబ్జానీ కొత్త కెప్టెన్ గా, ఈ సీజన్ చివరి కెప్టెన్ గా ఎన్నికయింది. దాంతో అందరూ సెలబ్రేట్ చేసారు. రామ్ ప్రసాద్ దేబ్జానీ ని ఎత్తుకొని తిప్పాడు. చివర్లో కెప్టెన్ కి ఇచ్చే మెడల్ ఇచ్చారు. కెప్టెన్సీ అయ్యాక గోల్డ్ కోయిన్స్ ప్రతి వారం ఇస్తారు. ఈ వారంతో ఎక్కువ కాయిన్స్ రామ్ ప్రసాద్ కి ఉండటంతో బిగ్ బాస్ మూడు ఆఫర్స్ ఇచ్చాడు. దాంట్లో రామ్ ప్రసాద్ ఇంట్లో వాళ్ళు మాట్లాడిన ఆడియో అడిగాడు. వాళ్ళ అక్క మాట్లాడిన ఆడియో పంపారు బిగ్ బాస్. దాంతో రామ్ ప్రసాద్ హ్యాపీ. మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో చివరి కెప్టెన్ గా దేబ్జానీ ఎన్నికయింది.
