Bigg Boss Guests : స్పెషల్ గెస్టులతో గేమ్స్.. ఫైనల్ కెప్టెన్సీ కోసం పోరు.. బిగ్ బాస్ తెలుగు 10 డే 79 ఫుల్ ఎపిసోడ్..
చివరి బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ జరగనుందని తెలిపాడు బిగ్ బాస్. (Bigg Boss Guests)
- Saketh U
- Published on- November 24, 2026 / 10:46 PM IST
Bigg Boss Guests
Bigg Boss Guests : నిన్నటి టాస్కుల్లో సుధీర్ డైరెక్ట్ 13వ వారంకి వెళ్లడంతో అందరూ ఆశ్చర్యపోయి అతన్ని అభినందించారు. అలాగే టికెట్ టు ఫినాలే మాత్రం ఎలాగైనా సాధిస్తాను అని చెప్పాడు. అనంతరం అమన్ కాఫీ పౌడర్ పోవడంతో అందర్నీ అడిగాడు. శివనే ఆ కాఫీ పౌడర్ దాచి తీసుకొచ్చాడు. దీంతో అమన్ – శివ మధ్య వాదన జరిగింది. శివ తన ప్రోటీన్ పోయింది అని గొడవ పడ్డాడు.
చివరి బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ జరగనుందని తెలిపాడు బిగ్ బాస్. ఈ కెప్టెన్సీ హోదా మాత్రమే ఫైనల్ వైపు ప్రయాణం వారం పాటు సుస్థిరం చేసుకోవచ్చు అన్నారు. అలాగే ఈ వారం ఛాలెంజ్ లలో మిమ్మల్ని కంటెండర్ గా సపోర్ట్ చేయడాకి బయట నుంచి బడ్డీస్ వస్తారు అని చెప్పారు. మొదట లాస్ట్ సీజన్ కంటెస్టెంట్స్ ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని వచ్చారు. రావడంతోనే ఇమ్మాన్యుయేల్ ఇంట్లో వాళ్లపై కామెడీ కౌంటర్లు వేసాడు. వర్షిణి, ముకేశ్, దేబ్జానీ.. ఇలా వరుసగా అందరిపై కౌంటర్లు వేస్తూ ఇమ్మాన్యుయేల్ సలహాలు ఇచ్చాడు. సంజన కూడా సలహాలు ఇచ్చింది. అందరితో కామెడీ చేస్తూనే వారు చేసే పనులను ఫన్నీగా మాట్లాడుతూ కౌంటర్లు వేస్తూ సలహాలు ఇచ్చారు.
Also See : Supritha : సుప్రీత కార్తీక పౌర్ణమి పూజలు.. ఫొటోలు..
ముకేశ్, త్రిగుణ, రామ్ ప్రసాద్, శివ, దేబ్జానీ, రామకృష్ణ వీకెండ్ లో గెలిచారు కాబట్టి వీళ్ళే కంటెండర్స్ అవ్వడానికి పోటీ పడతారు. ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని లను ఎవరికీ సపోర్ట్ చేస్తారో డిసైడ్ చేసుకోమ్మన్నాడు బిగ్ బాస్. దాంతో ఇమ్మాన్యుయేల్ ఆర్కేతో ఆడతాను అన్నాడు. సంజన త్రిగున్ తో ఆడతాను అని చెప్పింది.
ఒక బాక్స్ పజిల్ గేమ్ ఇచ్చారు. రామకృష్ణ రూల్స్ వదిలేసి ఆడటంతో గొడవ మొదలయింది. త్రిగున్ – రామకృష్ణ గొడవ పడ్డారు. ఇమ్మాన్యుయేల్ మధ్యలో వచ్చాడు. ముకేశ్, వంశీ, శివ కూడా గొడవ పడ్డారు. మధ్యలో ముకేశ్ వచ్చి గొడవ పడ్డాడు అసలేమీ సంబంధం లేకుండా. మొత్తానికి ఇమ్మాన్యుయేల్, రామకృష్ణ గెలిచారు ఈ ఆటలో. దాంతో రామకృష్ణ కంటెండర్ గా నిలిచాడు ఫైనల్ కెప్టెన్సీ పోటీకి. ఇమ్మాన్యుయేల్, సంజన వెళ్లిపోయారు. ఆ గేమ్ గురించి అందరూ డిస్కస్ చేసుకున్నారు, త్రిగున్ ఓడిపోయినందుకు ముకేశ్ బ్యాచ్ సంతోషం వ్యక్తం చేస్తూ అతని తప్పు పడుతూ మాట్లాడుతున్నారు. త్రిగున్ కూడా నేను ఓడిపోయినందుకు వాళ్ళు హ్యాపీ అని సంచాలక్ అమన్ తో మాట్లాడాడు.
Also See : Ruhani Sharma : ‘ఆకాశంలో ఒక తార’ వర్కింగ్ స్టిల్స్.. బిజిలి పాత్రలో జీవించేసిన రుహాణి శర్మ..
నెక్స్ట్ దివ్య, కళ్యాణ్ పడాల గెస్ట్ లుగా వచ్చారు. వెజిటేబుల్ గేమ్ ఆడించారు వీళ్ళతో. వెజిటేబుల్ పేరు రాసి ఉన్న ఒక దండని కంటెస్టెంట్స్ తీసుకొని హౌస్ లో దాని గుణగణాలు ఎవరికీ సెట్ అవుతాయో వాళ్లకు వేయాలి. ఈ గేమ్ కాసేపు నడిచింది. దీంట్లో ముకేశ్ సొరకాయ – ఒళ్ళు పెరిగింది బుర్ర పెరగలేదు అనే దండని అమన్ కి వేయడంతో అమన్ – ముకేశ్ మధ్య వాదన అయింది.
కళ్యాణ్ – దివ్య మిగిలిన నలుగురిలో ఇద్దర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో ఆడాలి అని చెప్పాడు బిగ్ బాస్. దీంతో కళ్యాణ్ పడాల ఆ నలుగురిని ఇంటర్వ్యూ చేసాడు. ఫైనల్ గా కళ్యాణ్ శివ, దివ్య రామ్ ప్రసాద్ ని సెలెక్ట్ చేసుకున్నారు. బాల్స్ విసిరి ఆపోజిట్ వ్యక్తుల ఫోటోలు చిరిగే టాస్క్ ఇచ్చారు. కళ్యణ్ బాల్స్ వాటర్ లో వేసేసి తప్పుడు గేమ్ ఆడి రామ్ ప్రసాద్ కి అన్యాయం చేసాడు. దాంతో రామ్ ప్రసాద్, త్రిగుణ, దివ్య కళ్యాణ్ తో గొడవ పడ్డారు. నా టీమ్ గెలవడానికి ఏమైనా చేస్తాను అని చెప్పాడు కళ్యాణ్. ఈ క్రమంలో ముకేశ్ దివ్యతో గొడవ పడ్డాడు గెస్ట్ గెస్ట్ లా ఉండండి అనడంతో దివ్య ఫైర్ అయింది. శివ ఈ గేమ్ లో గెలిచాడు. దీంతో శివ కెప్టెన్సీ పోటీకి అర్హుడయ్యాడు. రేపు మరో ఇద్దరు వచ్చి మిగిలిన ఇద్దరితో కలిసి కంటెండర్ టాస్క్ ఆడనున్నారు.
