Ananya Sharma : రొమాంటిక్ సీన్స్, బట్టలతో నాకు ప్రాబ్లమ్ లేదు.. నాకు ఇంటిమసీ సీన్స్ ఇష్టం.. కానీ..
అనన్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రొమాంటికి సీన్స్ గురించి, సినిమాల్లో డ్రెస్సింగ్ గురించి తన అభిప్రాయం తెలిపింది. (Ananya Sharma)
- Saketh U
- Published on- November 23, 2026 / 10:24 AM IST
Ananya Sharma
Ananya Sharma : యూట్యూబ్ లో 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకుంది అనన్య శర్మ. ఆ తర్వాత పలు సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది. ఇప్పుడు అనన్య శర్మ మెయిన్ లీడ్ లో నటించిన హై సినిమా నవంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రొమాంటికి సీన్స్ గురించి, సినిమాల్లో డ్రెస్సింగ్ గురించి తన అభిప్రాయం తెలిపింది.
అనన్య శర్మ మాట్లాడుతూ.. నాకు రొమాంటిక్ సీన్స్, వేసుకునే బట్టలతో ప్రాబ్లమ్ లేదు. కానీ స్టోరీకి అవసరం లేకుండా అలాంటి సీన్స్ కథలో పెడితే నచ్చదు. ఆడియన్స్ థియేటర్ కి వస్తారని, అలాంటి సీన్స్ పెట్టడం వల్ల ఈజీ సెల్లింగ్ అవుతుంది అనేది నాకు నచ్చదు. నిజంగా కథలో అది అవసరమయితే చేస్తాను. నాకు బేసిక్ గా ఇంటిమసీ సీన్స్ ఇష్టం. హాలీవుడ్ సినిమాల్లో ఇంటిమసీ సీన్స్ ఉంటాయి, రకరకాల బట్టలు వేసుకుంటారు. కానీ అది కథకు సెట్ అవుతుంది.
జస్ట్ గ్లామర్ చూపించడానికి సినిమాల్లో అలాంటి సీన్స్ చూపెట్టకూడదు. మనం వేసుకునే బట్టల బట్టి గ్లామర్ చూపించే విధానం బట్టే మనకు రోల్స్ కూడా వస్తాయి అంటారు. అందులో తప్పేం లేదు. వాళ్ళ విజన్ లో మనల్ని చూస్తారు. క్యాస్టింగ్ డైరెక్టర్స్ కూడా సినిమాలో పాత్రను రియల్ లైఫ్ లో మనం వేసుకునే బట్టలతో కూడా చూసి డిసైడ్ చేస్తారు ఒక్కోసారి అని తెలిపింది.
Also Read : Ananya Sharma : లవ్ బ్రేకప్ గురించి చెప్పిన అనన్య.. ఇప్పుడు కాబోయే వాడు ఎలా ఉండాలంటే..
మోడ్రన్ డ్రెస్ లకు, ఇంటిమసీ సీన్స్ కి కథకి సరిపోతుంది అనుకుంటే చేస్తానని చెప్పకనే చెప్పేసింది అనన్య. మరి భవిష్యత్తులో ఏదైనా సినిమాలో, సిరీస్ లో అలాంటి పాత్రల్లో కనిపిస్తుందేమో చూడాలి.
