Ananya Sharma : అల్లు అర్జున్ నా ఫేవరేట్ హీరో కానీ.. అలా చేయడం కరెక్ట్ కాదు.. ఆర్య 2 సినిమాపై అనన్య కామెంట్స్..
అనన్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, ఆర్య 2 సినిమాల ప్రస్తావన రాగా ఈ కామెంట్స్ చేసింది. (Ananya Sharma)
- Saketh U
- Published on- November 23, 2026 / 11:55 AM IST
Ananya Sharma
Ananya Sharma : అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన ఆర్య పెద్ద హిట్ కావడంతో ఆర్య 2 అనే టైటిల్ తో సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వకపోయినా మ్యూజికల్ హిట్ అయింది. ఆ తర్వాత టీవీలోకి వచ్చాక ప్రేక్షకులను మెప్పించింది. అప్పుడు హిట్ అవ్వకపోయినా ఆర్య 2 సినిమాకు ఇప్పుడు క్లాసిక్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆర్య 2 సినిమాలోని ఒక సీన్ పై నటి అనన్య శర్మ అభ్యంతరం వ్యక్తం చేసింది.
30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ తెచ్చుకున్న అనన్య శర్మ నటిగా వెబ్ సిరీస్ లు చేస్తూ ఇప్పుడు మెయిన్ లీడ్ లో హై అనే సినిమాతో రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అనన్య ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్, ఆర్య 2 సినిమాల ప్రస్తావన రాగా ఈ కామెంట్స్ చేసింది.
Also Read : Prabhudeva : షాకింగ్ కాంబో.. ప్రభుదేవా డైరెక్షన్లో మంచి విష్ణు సినిమా అనౌన్స్..
అనన్య శర్మ మాట్లాడుతూ.. నా ఫేవరేట్ హీరో ఎప్పటికీ అల్లు అర్జునే. దేశముదురు, ఆర్య 2 సినిమాలు నాకు చాలా ఇష్టం. కానీ ఆర్య 2 సినిమాలో ఒక డైలాగ్, సీన్ నాకు ఇష్టం ఉండదు. లిఫ్ట్ లో కాజల్ అగర్వాల్ ని అల్లు అర్జున్ ముద్దు పెట్టుకుంటాడు ఒక సీన్ లో. అప్పుడు ఆ వయసులో అది క్యూట్ గా అనిపించింది. కానీ మనం పెరిగే కొద్దీ మనకు అవగాహన వస్తుంది. అమ్మాయి అనుమతి లేకుండా అలా ముద్దు పెట్టడం కరెక్ట్ కాదు.
దానికి సంబంధించి డైలాగ్ ఉంటుంది ఆర్య అజయ్ తలపై పిల్లో పెడితే ఊపిరి ఆడట్లేదు అంటాడు. ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకోకపోతే నాకు కూడా ఊపిరి ఆడలేదు అని చెప్తాడు. అందుకే ఆ సీన్, డైలాగ్ నాకు నచ్చలేదు. కానీ అల్లు అర్జున్ సర్ అంటే రెస్పెక్ట్ ఉంది అని అన్నారు.
