Political party : సీనియర్ నటుడు పొలిటికల్ పార్టీ..? పంది ముఖంతో పోస్టర్స్ వైరల్..

political party : ఇటీవల రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

A political party by a senior actor Posters featuring a pigs face go viral

political party : ఇటీవల రాజకీయాల్లోకి పలువురు సినీ నటులు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ సీనియర్ హీరో, మాజీ ఎంపీ కొత్త పొలిటికల్ పార్టీ పెడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దానికి తగ్గట్టే సైలెంట్ పొలిటికల్ పార్టీ అనే పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి పంది ముఖంతో ఉన్న పోస్టర్స్ పోస్ట్ చేస్తున్నారు.

ఈ పోస్టర్స్ మీద పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా అనే కొటేషన్ ఉంది. ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలోనే కాదు కొన్ని పేపర్స్ లో కూడా ప్రకటనలుగా ఇచ్చారట. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ లాగా ఇది కూడా ఏదైనా కొత్తగా ప్రశ్నించే పార్టీనా లేక సినిమా నటుడు అంటున్నారు కాబట్టి ఇదేమైనా సినిమా ప్రమోషనా అని కూడా పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Reba Monica John : కూతురితో స‌ర‌దాగా.. రెబా మోనికా జాన్ ఫోటోలు వైర‌ల్..

దాంతో ఈ సైలెంట్ పొలిటికల్ పార్టీ సోషల్ మీడియాలో చర్చగా మారింది. రాజకీయాల మీద వ్యంగ్యంగానే ఈ పంది ముఖం పోస్టర్స్ రిలీజ్ చేసారా? దీనిపై ఎవరైనా స్పందిస్తారా చూడాలి. ఒకవేళ ఇది నిజమైన రాజకీయ పార్టీ అయితే ఏ హీరో పెడుతున్నాడు? ఎందుకు పెడుతున్నాడు? ఏ సమస్యల మీద పోరాటం చేయడానికి పెడుతున్నాడు అని కూడా ప్రశ్నిస్తున్నారు. మరి త్వరలోనే ఈ పంది మాస్క్ ముఖం తీసేసి సైలెంట్ పొలిటికల్ పార్టీ ప్రధాన సూత్రధారుడు ఎవరు? దీని క‌ర్త‌వ్యం ఏంటి అని చెప్పారా చూడాలి.