Yashoda Hospitals Roundtable : ఎక్కువ కాలం బతకడమే కాదు.. ఆరోగ్యంగా బతకాలి.. విజయ్ దేవరకొండ, పీవీ సింధు వెల్‌నెస్ మంత్రం ఇదే!

Yashoda Hospitals Wellbeing Roundtable : విజయ్ దేవరకొండ, పీవీ సింధు పాల్గొన్న యశోద హాస్పిటల్స్ ది వెల్బీయింగ్ రౌండ్టేబుల్‌లో ఆరోగ్యకరమైన జీవనశైలి, దీర్ఘాయుష్షు, ఉద్యోగుల శ్రేయస్సుపై కీలక చర్చ జరిగింది..

Yashoda Hospitals Wellbeing Roundtable

  • యశోద హాస్పిటల్స్ వెల్బీయింగ్ రౌండ్టేబుల్ చర్చ
  • అనారోగ్యం వచ్చాక కాదు.. ముందే మేల్కొందాం
  • లైఫ్‌లో సక్సెస్‌తో పాటు హెల్త్ కూడా ముఖ్యం..
  • విజయ్ దేవరకొండ, పీవీ సింధు వెల్‌నెస్ సూత్రాలు

Yashoda Hospitals Wellbeing Roundtable : జీవితంలో ఎంత సాధించినా.. ఆరోగ్యం బాగుంటేనే ఆ విజయాలను ఆస్వాదించగలం.. బిజీ లైఫ్‌లో సంపాదన, కెరీర్, లక్ష్యాల వెంట పరుగులు పెడుతూ చాలామంది ఆరోగ్యాన్ని మాత్రం పక్కన పెడుతున్నారు.

కానీ, ఎక్కువ కాలం జీవించడం కన్నా ఉన్నన్ని రోజులు ఆరోగ్యంగా, ఆనందంగా బతకడం ముఖ్యమనే సందేశాన్ని ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఇచ్చారు. హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్స్ – హైటెక్ సిటీ నిర్వహించిన ‘ది వెల్బీయింగ్ రౌండ్టేబుల్ యాడింగ్ లైఫ్ టు ఇయర్స్’ వేదికగా ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆసక్తికరమైన చర్చ జరిగింది..

నవంబర్ 18న నిర్వహించిన ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి. పటేల్ (దాజీ) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పీవీ సింధు ప్రత్యేక ప్యానెల్ సభ్యురాలిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లకు చెందిన సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, కార్పొరేట్ ప్రతినిధులు సహా సుమారు 500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆరోగ్యానికి టైమ్ ఇవ్వాల్సిందే : విజయ్ దేవరకొండ
ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని విజయ్ దేవరకొండ సూచించారు. సరైన ఆహారం, వ్యాయామం, మానసిక ప్రశాంతతతో కూడిన జీవనశైలి ఉంటేనే జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పారు.

Read Also : Indiramma Insurance Scheme : ఇందిరమ్మ బీమాపై తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా.. నవంబర్ 19 నుంచే..

క్రమశిక్షణే ఆరోగ్యానికి పునాది : పీవీ సింధు
క్రీడాకారులకే కాదు.. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యం, క్రమశిక్షణ అవసరమని పీవీ సింధు పేర్కొన్నారు. వ్యాయామం, సమతుల ఆహారం, తగినంత విశ్రాంతి రోజువారీ జీవితంలో భాగం కావాలని సూచించారు.

శరీరం, మనసు రెండూ బాగుండాలి: దాజీ
ఆరోగ్యం అంటే కేవలం శారీరక దృఢత్వం మాత్రమే కాదని, శరీరం, మనసు, భావోద్వేగాల మధ్య సమతుల్యత అవసరమని దాజీ వివరించారు. ధ్యానం, ప్రశాంతమైన ఆలోచనలు జీవితంలో సానుకూల మార్పులు తీసుకొస్తాయని చెప్పారు.

యశోద హాస్పిటల్స్ చైర్మన్ జి. రవీందర్ రావు మాట్లాడుతూ.. వ్యాధుల నివారణకు చికిత్సతో సమాన ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. చిన్న వయసులోనే జీవనశైలి వ్యాధులు పెరుగుతున్నాయని, ఉద్యోగుల ఆరోగ్యాన్ని సంస్థల పని సంస్కృతిలో భాగం చేయాలని డైరెక్టర్ డాక్టర్ అభినవ్ గురుకంటి సూచించారు. అనారోగ్యం వచ్చాక ఆసుపత్రుల చుట్టూ తిరగడం కన్నా ముందే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనే సందేశాన్ని ఈ రౌండ్టేబుల్ ఇచ్చింది..