Telangana Home Guards: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. 2వేల హోంగార్డు ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
Telangana 2000 Home Guards Recruitment : రాష్ట్రంలో 2వేల హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే నెల మొదటి వారంలో ఇందుకు సంబంధించిన నోఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
- Harish Thanniru
- Updated on- November 25, 2026 / 01:07 PM IST
Telangana Government Notification for Recruitment 2000 Home Guards Posts Released in December First Week
Telangana Home Guards Recruitment: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పోలీస్ శాఖలో కొత్త హోంగార్డుల నియామకాలకు రంగం సిద్ధమైంది. దాదాపు 2వేల పోస్టులను భర్తీ చేసేందుకు డీజీపీ కార్యాలయం కసరత్తు మొదలు పెట్టింది.
Also Read : Rice Price : పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలకు భారీ శుభవార్త.. దిగొచ్చిన బియ్యం ధరలు.. కారణాలివే..!
డీజీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో ఇటీవల మినీ స్టాఫ్ ఆఫీసర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి వార్షిక శిక్షణ క్యాలెండర్ సిద్ధం చేయడం, రెండు వేల మంది హోంగార్డుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్, ఇతర వివరాలు, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తెలంగాణ పోలీస్ శాఖ మంజూరైన సిబ్బంది సంఖ్యను పునఃసమీక్షించడం వంటి అంశాలను పరిశీలించారు. రిటైర్డ్ పోలీస్ అధికారుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
హోంగార్డు నియామకాలకు సంబంధించి డిసెంబర్ 6వ తేదీన హోంగార్డు రైజింగ్ డే సందర్భంగా నియామక నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి లేదంటే ఇంటర్మీడియట్ ప్రాతిపదికగా నియామకాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. అదేవిధంగా ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ లో విధులు నిర్వహించాల్సి ఉండటంతో అభ్యర్థుల శారీరక సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. యూనిఫాం సర్వీసెస్ కావడంతో హోంగార్డుల నియామకాల్లో ఎలాంటి అవినీతికి తావులేకుండా పారదర్శకంగా ఎంపిక చేసే దిశగా డీజీపీ కార్యాలయం ఏర్పాట్లు చేస్తుంది.
కొత్తగా రిక్రూట్ చేసుకునే హోంగార్డులను తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో (టీజీ- మార్చ్) అవసరాల కోసం నియమించేందుకు నిర్ణయించినట్లు సమాచారం.
