My Home Vyoma : భూతల స్వర్గం ‘మైహోమ్ వ్యోమ’.. మరో లగ్జరీ ప్రాజెక్టుకు మైహోమ్ గ్రూప్ శ్రీకారం..
My Home Vyoma : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. నానక్‌రామ్‌గూడలో నిర్మిస్తున్న ‘మై హోమ్ వ్యోమ’ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సెంటర్, మోడల్ ఫ్లాట్‌ను సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు ప్రారంభించారు.
- Harish Thanniru
- Published on- November 20, 2026 / 07:59 PM IST
My Home Vyoma
My Home Vyoma : ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ మై హోమ్ గ్రూప్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో నిర్మిస్తున్న ‘మై హోమ్ వ్యోమ’ ప్రాజెక్టుకు సంబంధించి ఎక్స్పీరియన్స్ సెంటర్, మోడల్ ఫ్లాట్‌ను సంస్థ చైర్మన్ జూపల్లి రామేశ్వర రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జూపల్లి వినోద్ రావు, జూపల్లి శ్యామ్ రావు, జూపల్లి రాము రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జూపల్లి రామేశ్వర రావు మాట్లాడుతూ.. మై హోమ్ సంస్థపై కస్టమర్లు చూపిస్తున్న నమ్మకమే తమ బ్రాండ్‌కు అసలైన బలమని అన్నారు. మైహోమ్ ప్రాజెక్టుల్లో ఇళ్లు కొనుగోలు చేసిన వారే తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారుతున్నారని పేర్కొన్నారు. నాణ్యమైన నిర్మాణాలు చేపట్టడంతోపాటు, నిర్ణీత సమయంలోనే ప్రాజెక్టులను పూర్తి చేసి కస్టమర్లకు అప్పగించడం తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
1986లో కేవలం 32 ఫ్లాట్లతో ప్రారంభమైన మై హోమ్ ప్రస్థానం.. నేడు వేలాది ఫ్లాట్ల నిర్మాణ స్థాయికి చేరుకుందని రామేశ్వర రావు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా కస్టమర్ల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ సంస్థను విస్తరిస్తున్నామని చెప్పారు. తాజాగా మై హోమ్ వ్యోమ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రారంభించామని, ఇందులో భాగంగా మోడల్ ఫ్లాట్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
ఐటీ రంగానికి కీలక కేంద్రంగా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఈ భారీ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. జీ+50 అంతస్తులతో మొత్తం 12 టవర్లలో మై హోమ్ వ్యోమ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్రస్తుత తరం అభిరుచులు, అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో విలాసవంతమైన నివాసాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్‌లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు మై హోమ్ కస్టమర్లుగా ఉన్నారని రామేశ్వర రావు పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే ఎన్నో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను నాణ్యతతో నిర్మించామని, ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు సైతం తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. నాణ్యత, భద్రత, నిర్ణీత గడువులో నిర్మాణాలు పూర్తి చేయడం వల్లే మై హోమ్ సంస్థపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. మధ్యతరగతి కుటుంబాలకుసైతం అందుబాటులో ఉండేలా వివిధ ధరల శ్రేణుల్లో ఫ్లాట్లను అందిస్తున్నామని తెలిపారు. తమ గురువుల ఆశీస్సులు, దేవుడి దీవెనలు, కస్టమర్ల నమ్మకం, ఉద్యోగుల నిరంతర కృషి సంస్థ విజయానికి ప్రధాన కారణాలని జూపల్లి రామేశ్వర రావు పేర్కొన్నారు. ప్రతి ప్రాజెక్టులో పచ్చదనానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు.
