Income Tax Calendar Dec 2026 : ట్యాక్స్ కట్టేవారికి అలర్ట్.. TDS నుంచి ITR వరకు.. డిసెంబర్‌లో ఈ 4 తేదీలు మర్చిపోతే జేబుకు చిల్లు!

Income tax calendar December 2026 : డిసెంబర్ 2026లో ఆదాయపు పన్నుకు సంబంధించిన కీలక గడువులు దగ్గరపడుతున్నాయి. టీడీఎస్ చెల్లింపులు, అడ్వాన్స్ ట్యాక్స్, బిలేటెడ్ ఐటీఆర్, ఫాస్ట్ డీఎస్ (FAST-DS) పథకం గడువులు, పన్ను చెల్లింపుదారులు తప్పక తెలుసుకోండి..

Income Tax Calendar December 2026

  • ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..
  • ట్యాక్స్ పనులు పూర్తి చేశారా? ఈ డెడ్‌లైన్స్ మిస్ కావొద్దు
  • డిసెంబర్ ట్యాక్స్ క్యాలెండర్‌, వరుస పన్ను గడువులు

Income tax calendar December 2026 : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ నెల దగ్గరపడుతోంది. ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఈ డిసెంబర్ నెల చాలా కీలకం కానుంది. ముఖ్యంగా ఉద్యోగులు, వ్యాపారులు, ట్యాక్స్ డిడక్టర్లు, విదేశీ ఆస్తులు ఉన్న అర్హులైన వ్యక్తులు కొన్ని ముఖ్యమైన గడువులను గుర్తుపెట్టుకోవాలి.

టీడీఎస్ చెల్లింపుల నుంచి అడ్వాన్స్ ట్యాక్స్ వరకు, బిలేటెడ్ ITR నుంచి విదేశీ ఆస్తుల వెల్లడికి సంబంధించిన FAST-DS పథకం వరకు ఈ నెలలో అన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో తేదీ దాటిపోతే ఇబ్బందులు తప్పవు.. అందుకే డిసెంబర్ ట్యాక్స్ క్యాలెండర్‌పై ఓసారి లుక్కేయండి.

డిసెంబర్ 7, 15 తేదీలు చాలా ముఖ్యం :
నవంబర్ 2026లో మినహాయించిన లేదా వసూలు చేసిన TDS, TCS మొత్తాలను డిసెంబర్ 7వ తేదీలోగా కేంద్ర ప్రభుత్వానికి డిపాజిట్ చేయాలి. నవంబర్‌లో అందిన ఫారం 127 డిక్లరేషన్లను కూడా ఇదే తేదీలోగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Read Also : Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?

ఇక డిసెంబర్ 15న మరో రెండు ముఖ్యమైన పనులున్నాయి. అక్టోబర్‌లో నిర్దిష్ట లావాదేవీలపై టీడీఎస్ మినహాయించిన వారు ఫారం 132 సర్టిఫికెట్లు జారీ చేయాలి. అలాగే 2026–27 పన్ను సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ మూడో విడత కూడా చెల్లించాలి. అంచనా వార్షిక పన్ను బాధ్యత రూ.10 వేల కన్నా ఎక్కువగా ఉన్నవారు, TDS, TCS సర్దుబాటు తర్వాత వర్తించే మొత్తంలో కనీసం 75 శాతం అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించి ఉండాలి..

డిసెంబర్ 30, 31 తేదీల్లో కీలక గడువులు :

నవంబర్‌లో జరిగిన నిర్దిష్ట లావాదేవీలపై టీడీఎస్ వివరాలను ఫారం 141 ద్వారా డిసెంబర్ 30లోగా సమర్పించాలి. ఇక డిసెంబర్ 31 మరింత కీలకం.. 2026–27 అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి బిలేటెడ్ ఐటీఆర్ దాఖలు చేసేందుకు ఇదే లాస్ట్ (అసెస్‌మెంట్ పూర్తయ్యేలోపు అనే నిబంధనకు లోబడి) డేట్ అని మర్చిపోవద్దు..

అర్హులైన వ్యక్తులు విదేశీ ఆస్తులు లేదా ఆదాయాన్ని వెల్లడించేందుకు (FAST-DS) పథకం కింద ఫారం 1ను కూడా డిసెంబర్ 31లోగా సమర్పించాలి. దీంతోపాటు అర్హత కలిగిన మల్టీ నేషనల్ సంస్థల భారతీయ సంస్థలు ఫారం 3CEAD దాఖలు చేయాల్సి ఉంటుంది.

లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందుగానే ఈ టాక్సు పనులన్నీ పూర్తి చేసుకోవడం బెటర్.. మీకు వర్తించే గడువులను ఒకసారి చెక్ చేసుకుని పెనాల్టీలు, అనవసర ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడండి..