EPFO New Rules 2026 : పీఎఫ్ ఖాతాలో ఇక 10 శాతం ఉంటే చాలు.. మిగతా డబ్బులన్నీ తీసుకోవచ్చా?

EPFO New Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. విత్‌డ్రా లిమిట్, ఫైనల్ సెటిల్‌మెంట్ గడువు, రిటైర్మెంట్ తర్వాత SWP సదుపాయంలో వచ్చిన కీలక మార్పులేంంటో ఓసారి తెలుసుకుందాం..

EPFO New Rules 2026 Update

EPFO New Rules 2026 : పీఎఫ్ ఖాతాదారులకు భారీ రిలీఫ్.. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ప్రావిడెంట్ ఫండ్ (PF) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఖాతాదారులకు మరింత వెసులుబాటు కల్పించేలా విత్‌డ్రా నిబంధనల్లో మార్పులకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగం కోల్పోయినవారు, రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారికి ఈ నిర్ణయాలు ఊరటనివ్వనున్నాయి.. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

విత్‌డ్రా నిబంధనల్లో కీలక మార్పు.. :
గతంలో పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం మొత్తాన్ని అలాగే ఉంచుకోవాల్సి ఉండేది. తాజాగా ఈ పరిమితిని 10 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించింది. అంటే అర్హత ఉన్న సందర్భాల్లో ఖాతాదారులు తమ పీఎఫ్ మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కలగనుంది. అయితే, దీనికి సంబంధించి అమలయ్యే నిబంధనలు, అర్హతలను కూడా తెలుసుకుని ఉండాలి..

మరోవైపు ఉద్యోగం మానేసిన తర్వాత పూర్తి పీఎఫ్ సొమ్ము కోసం గతంలో ఉన్న 12 నెలల వెయింటింగ్ పీరియడ్ ఉండగా ఇప్పుడు దాన్ని రెండు నెలలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఉద్యోగం కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి కొంత ఉపశమనం లభించనుంది.

Read Also : Huawei OSTA O1 Pro : 200MP కెమెరా, 16GB ర్యామ్.. హువావే కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

రిటైర్మెంట్ తర్వాత కూడా నెలనెలా డబ్బులు :
ఈపీఎఫ్ఓ తీసుకున్న మరో ముఖ్యమైన నిర్ణయం.. సిస్టమాటిక్ విత్‌డ్రా ప్లాన్ (SWP). తద్వారా ఉద్యోగ విరమణ చేసినవారు తమ పీఎఫ్ సొమ్మును ఒకేసారి తీసుకోకుండా నెలవారీ, 3 నెలలకు ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి విడతల వారీగా పొందే అవకాశం ఉంటుంది. మిగిలిన మొత్తంపై వడ్డీ బెనిఫిట్ పొందే వీలుంటుంది.

ఇప్పటికే రూ.5 లక్షల వరకు అర్హత ఉన్న అడ్వాన్స్ క్లెయిమ్స్ ఆటో సెటిల్‌మెంట్ సదుపాయం కూడా పొందవచ్చు. కేవైసీ, బ్యాంక్ వివరాలు సరిగ్గా ఉంటే క్లెయిమ్ ప్రాసెస్ వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

మొత్తానికి పీఎఫ్ ఖాతాదారులకు తమ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు పొందే వెసులుబాటు పెరగనుంది. అయితే, అన్ని మార్పులు ఒకేసారి అమల్లోకి వచ్చాయని భావించకూడదు.. ఈపీఎఫ్ఓ అధికారిక ప్రకటనల్లో అమలు తేదీలు, మార్గదర్శకాలను పరిశీలించడం ఎంతైనా మంచిది..