Car Prices Hiked : కార్ల రేట్లకు రెక్కలు.. టాటా, హ్యుందాయ్ నుంచి ఆడీ వరకు ధరల పెంపు.. ఎప్పటినుంచంటే?
Car Prices Hiked : కారు కొనాలనుకునే వారికి షాక్.. టాటా మోటార్స్, హ్యుందాయ్ కార్ల ధరలను డిసెంబర్ 1 నుంచి పెంచుతున్నాయి. ఆడీ కూడా జనవరి నుంచి ధరలు పెంచనుంది. ఏ కంపెనీ ఎంత పెంచిందో తెలుసుకోండి..
- Sreehari A
- Published on- November 24, 2026 / 07:13 PM IST
Tata Motors, Hyundai Announce Price
- కారు కొనాలనుకుంటున్నారా?
- మళ్లీ పెరిగిన కార్ల ధరలు..
- డిసెంబర్ 1 నుంచి కొత్త ధరలు
- టాటా, హ్యుందాయ్ కీలక ప్రకటన
Car Prices Hiked : కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకో షాకింగ్ న్యూస్.. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న సామాన్యులకు మరో భారం పడనుంది. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో మరోసారి కార్ల ధరల పెంపు మొదలైంది. మారుతీ సుజుకీ తర్వాత ఇప్పుడు టాటా మోటార్స్, హ్యుందాయ్, ఆడీ కూడా కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో కొత్త కారు కొనాలనుకునే వారిపై అదనపు భారం పడనుంది..
డిసెంబర్ 1 నుంచి టాటా కార్లు ప్రియం :
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ తన కార్లు, ఎస్‌యూవీల ధరలను 0.5 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలకూ వర్తించనుంది. డిసెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి..
హ్యుందాయ్ కూడా అదే బాటలో.. :
మరోవైపు హ్యుందాయ్ మోటార్ ఇండియా కూడా ఎంపిక చేసిన కార్ల ధరలను పెంచింది. మోడల్‌ను బట్టి గరిష్ఠంగా రూ.8 వేల వరకు ధరలు పెరగనున్నాయి. ఈ కొత్త ధరలు కూడా డిసెంబర్ 1 నుంచే అమల్లోకి వస్తాయి. అటు లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ సైతం వెనక్కి తగ్గలేదు. భారత్‌లో విక్రయించే తన మోడళ్ల ఎక్స్‌షోరూమ్ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది.
ధరల పెంపునకు కారణమేంటి? :
కార్ల తయారీకి అవసరమైన ముడి సరుకుల ధరలు పెరగడం, ఉత్పత్తి ఖర్చులు అధికం కావడమే దీనికి ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. పెరుగుతున్న వ్యయాలను ఇప్పటివరకు భరిస్తూ వచ్చినప్పటికీ, కొంత భారాన్ని తప్పనిసరిగా కొనుగోలుదారులపై వేయాల్సి వస్తోందని చెబుతున్నాయి..
ఇప్పటికే కారు కొనుగోలు చేయాలంటే బడ్జెట్ చూసుకోండి.. ధరల పెంపుతో కొనుగోలుదారులపై భారం మరింత పెరగనుంది. రాబోయే రోజుల్లో ఇతర కార్ల కంపెనీలు కూడా ఇదే బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
