8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!

8th Pay Commission : 8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సగటున రూ.3.4 లక్షల వరకు బకాయిలు అందే అవకాశం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. ఈ లెక్కలు, అమలు తేదీ, బకాయిల చెల్లింపుపై పూర్తి వివరాలివే..

8th Pay Commission

  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గుడ్‌న్యూస్..
  • ఉద్యోగులకు ఒక్కొక్కరికి రూ.3.4 లక్షల బకాయిలు?
  • ఎప్పటి నుంచి అమలు కానుందో తెలుసా?
  • జేపీ మోర్గాన్ అంచనా వేసిన లెక్కలివే..

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ అందనుంది.. అతి త్వరలో కీలక ప్రకటన వెలువడనుంది. 8వ వేతన సంఘం అమలైతే భారీ మొత్తంలో జీతాలు పెరగనున్నాయి.

అంతేకాదు.. గత నెలలకు సంబంధించిన బకాయిల రూపంలో ఒక్కొక్కరికి సగటున రూ.3.4 లక్షల వరకు అందవచ్చని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జేపీ మోర్గాన్ (8th Pay Commission) అంచనా వేసింది. ఈ వార్తతో లక్షలాది మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లలో ఆసక్తి పెరిగింది..

జేపీ మోర్గాన్ తన 2027 ఇండియా ఈక్విటీ స్ట్రాటజీ రిపోర్టులో ఈ వివరాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా సుమారు 1.2 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు కలిపి రూ.7.2 లక్షల కోట్ల వరకు చెల్లింపులు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో రూ.4 లక్షల కోట్లు బకాయిల రూపంలోనే ఉండవచ్చని అంచనా..

నెలకు రూ.15,400 అదనపు ఆదాయం :
8వ వేతన సంఘం అమలుతో సగటున నెలకు రూ.15,400 వరకు అదనపు జీతం అందవచ్చని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. కొత్త వేతనాలు 2026 జనవరి 1 నుంచి అమలవుతాయని భావిస్తే.. 2027 అక్టోబర్ వరకు 22 నెలల బకాయిలు పేరుకుపోతాయి.

Read Also : Black Friday Sale 2026 : కొత్త ఫోన్, ల్యాప్‌టాప్ కావాలా? బ్లాక్ ఫ్రైడే సేల్‌లో రూ.57 వేల వరకు డిస్కౌంట్లు.. ఈ ఆఫర్లు మిస్ కావద్దు!

ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.3.4 లక్షలు రావచ్చని నివేదిక పేర్కొంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా రెండు విడతల్లో చెల్లించే అవకాశం ఉందని అంచనా. 2028 ఆర్థిక సంవత్సరంలో 40 శాతం, 2029లో మిగిలిన 60 శాతం చెల్లించవచ్చని తెలిపింది.

అమలు తేదీ మారితే బకాయిలు తగ్గుతాయా? :
అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది.. కొత్త వేతనాలు 2026 జనవరి నుంచి కాకుండా 2027 జనవరి నుంచి అమలైతే మొత్తం బకాయిలు రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.1.8 లక్షల కోట్లకు తగ్గవచ్చని జేపీ మోర్గాన్ వెల్లడించింది.

మరోవైపు.. గత వేతన సంఘాల తరహాలో అలవెన్సులపై బకాయిలు ఇవ్వకపోతే ఈ మొత్తం మరింత తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలు మాత్రం 2026 జనవరి నుంచే అమలు చేయాలని పట్టుబడుతున్నాయి.

3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కూడా కోరుతున్నాయి. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక అమలు తేదీని వెల్లడించలేదు. రూ.3.4 లక్షల అంచనా అనేది నిజం కాదు.. ఫైనల్ డిసెషన్ వచ్చేవరకు ఆగాల్సిందే..