School Holidays : ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 26న స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన సర్కార్.. ఎందుకంటే?
School Holidays : ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 26వ తేదీన (గురువారం) పాఠశాలలు, కాలేజీలకు సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
- Harish Thanniru
- Published on- November 25, 2026 / 11:42 AM IST
School Holidays
School Holidays : ఏపీలోని విద్యార్థులకు బిగ్ అలర్ట్. ఈనెల 26వ తేదీన (గురువారం) పాఠశాలలు, కాలేజీలకు సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులుసైతం జారీ అయ్యాయి. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. సెలవు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని పాఠశాలలకు కాదు. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో మాత్రమే సెలవు ఉంటుంది.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే కార్పొరేషన్, మున్సిపల్, నగరపాలక సంస్థలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ముగిసింది. మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే, ఈ ఎన్నికలు కొన్ని ప్రాంతాల్లో జరగలేదు. తుఫాన్ ప్రభావం, ఇతర కారణాల వల్ల పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో 26వ తేదీన పోలింగ్ జరగనుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 26వ తేదీన నాలుగు నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీల్లో ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది. వీటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలు ఉండగా.. అముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి. కొత్తకోట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 26న పోలింగ్ జరగనుంది.
పోలింగ్ జరిగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు.. కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలతోపాటు స్థానిక ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు ఉంటుంది. లాగే ఇదే రోజు 26 జిల్లాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగుతాయి. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ నిర్వహిస్తారు.
42 రెవెన్యూ డివిజన్లలోని 201 మండలాల్లో మొదటి విడతలో 3949 గ్రామాల సర్పంచ్‌లకు, 39,832 వార్డులకు ఈ నెల 26వ తేదీన ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, పంచాయతీ ఎన్నికల తొలి విడతలో 758 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 14,727 వార్డులకు కూడా పోటీలేకుండా ఎన్నికయ్యారు. మిగిలిన 3191 సర్పంచ్ స్థానాలకు, 25,016 వార్డులకు సంబంధించ పోలింగ్ జరగనుంది.
