AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల సమరం.. విడుదలైన తుది దశ నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ(AP Panchayat Elections) ఎన్నికల తుది దశ నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 21 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.

Ap panchayat elections final phase notification released polling and results on december 2

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల పోరు రసవత్తరంగా సాగుతూ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే తొలి దశ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయి అభ్యర్థుల తుది జాబితా ఖరారు కాగా, రెండో దశకు బుధవారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా తుది దశ పంచాయతీ(AP Panchayat Elections) ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధికారులు నేడు విడుదల చేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎల్లుండి అనగా ఈనెల 21 నుంచి ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తుది దశ నామినేషన్లను స్వీకరించనుండగా, ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దాఖలు చేసేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించారు.

UPI Charges: యూపీఐ యూజర్లకు సూపర్ గుడ్ న్యూస్.. MDR ఛార్జీల అమలు ఇప్పట్లో లేనట్టే? వ్యాపారులకు భారీ ఊరట!

నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు వివరాలు ఇవే!

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం, ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ చేపట్టనున్నారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అభ్యంతరాలు లేదా అప్పీళ్లు దాఖలు చేసేందుకు 25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చి, 26వ తేదీన వాటిని పరిష్కరించనున్నారు. అనంతరం నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం కేటాయించి, అదే రోజు సాయంత్రం బరిలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించనున్నారు.

డిసెంబర్ 2న పోలింగ్, మధ్యాహ్నమే ఫలితాలు.. ఏర్పాట్లపై అధికారుల దృష్టి:

తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 2వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను వెల్లడిస్తారు. ఒకవేళ అనివార్య కారణాలతో ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే, డిసెంబర్ 3వ తేదీన ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామని స్పష్టం చేస్తూ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.