DGP Harish Kumar Gupta: ఏపీలో లొంగిపోయిన 18 మంది మావోయిష్టులు.. పునరావాసం కోసం రూ.75 లక్షల ఆర్ధిక సాహాయం.. డీజీపీ కీలక ప్రకటన!

ఏపీని నక్సల్ రహిత రాష్ట్రంగా మార్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)తెలిపారు. లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు రూ.75 లక్షల సాయం అందించామని వెల్లడించారు.

Andhra pradesh naxal free state dgp harish kumar gupta maoists surrender rehabilitation 75 lakhs

DGP Harish Kumar Gupta: ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు కార్యకలాపాలను సమర్థవంతంగా కట్టడి చేస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్రాన్ని నక్సల్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)వెల్లడించారు. హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదనే భావన లొంగిపోయిన నక్సలైట్లలో స్పష్టంగా కనిపిస్తోందని, వారి జీవనోపాధి పరిస్థితులపై తమ సిబ్బంది నిరంతరం ఆరా తీస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశామని స్పష్టం చేస్తూ, శనివారం అమరావతిలోని డీజీపీ కార్యాలయంలో లొంగిపోయిన 18 మంది మావోయిస్టులకు పునరావాస సహాయం కింద రూ.75 లక్షల విలువైన డీడీలను స్వయంగా అందజేశారు. ఈ 18 మందిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు జోరిగ నాగరాజు అలియాస్ కమలేష్‌కు రూ.20 లక్షలు అందించగా, మిగిలిన 17 మందికి రూ.లక్ష, రూ.4 లక్షలు, రూ.5 లక్షల చొప్పున సహాయం పంపిణీ చేశారు.

Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. స్టాలిన్ షాకింగ్ నిర్ణయం.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

ఎన్కౌంటర్లు, అరెస్టులు, రివార్డుల లెక్కలు.. డీజీపీ కీలక గణాంకాలు:

గత రెండున్నర ఏళ్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు మృతి చెందారని, మరో 73 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరించారు. లొంగిపోయిన మావోయిస్టుల కోసం కేటాయించిన రూ.2.87 కోట్ల రివార్డు నిధుల్లో ఇప్పటికే రూ.91 లక్షలు ఇవ్వగా, తాజాగా మరో రూ.75 లక్షలు అందజేసినట్లు తెలిపారు. ఇంకా లొంగిపోయిన 32 మంది మావోయిస్టులకు రూ.1.21 కోట్ల పునరావాస సాయాన్ని త్వరలోనే అందిస్తామని ప్రకటించారు.

మన్యం అభివృద్ధి, ఉపాధి కల్పన.. మౌలిక వసతుల విస్తరణ:

నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో శాంతితో పాటు అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు. సరల్ పథకం ద్వారా 2,000 మందికి వృత్తి శిక్షణ, ప్రేరణ ద్వారా 1,200 మంది యువతకు, స్ఫూర్తి ద్వారా 175 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు గణాంకాలు వెల్లడించారు. అలాగే మన్యం జిల్లాల్లో 169 రోడ్లు, 39 వంతెనల నిర్మాణం చేపట్టడంతో పాటు 2,090 మొబైల్ టవర్లతో 96 శాతం గ్రామాలకు నెట్‌వర్క్ కనెక్టివిటీ పూర్తి చేసినట్లు వివరించారు.