Tamil Nadu Politics : ఏపీ దెబ్బకు తమిళనాడులో ప్రకంపనలు.. విజయ్ సర్కార్‌కు కొత్త తలనొప్పి.. డేటా లీక్ వివాదం!

Tamil Nadu Politics : ఏపీకి రూ.1,614 కోట్ల పెట్టుబడులు తరలిపోవడానికి విజయ్ సర్కార్ ఫెయిల్యూరే కారణమంటూ డీఎంకే పార్టీ అటాక్ స్టార్ట్ చేస్తుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగిందన్న టాక్ వైరల్ అవుతోంది.

Tamil Nadu Investments

Tamil Nadu Politics : తమిళనాడులో టీఎంకే వర్సెస్ డీఎంకే పొలిటికల్ ఫైట్‌కు ఇంకో అంశం ఆజ్యం పోసింది. తమిళనాడు పెట్టుబడులకు చెందిన అత్యంత కీలక సమాచారం ఏపీకి చేరిందన్న ఆరోపణలు పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీశాయి. ఇష్యూ బేస్డ్‌గా విజయ్‌ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టేందుకు కాచుకొని కూర్చున్న డీఎంకే పార్టీకి.. పెట్టుబడుల సమాచారం ఏపీకి లీక్ అయిందన్న టాక్ అస్త్రంగా మారిందట. దీంతో విజయ్ ప్రభుత్వంపై బాణాలు ఎక్కుపెడుతోంది.

Also Read : Paritala Sriram : శ్రీ సత్యసాయి జిల్లా తొలి జడ్పీ చైర్మన్‌గా పరిటాల శ్రీరామ్ ప్రమాణ స్వీకారం.. ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఇదే..

ఏపీకి రూ.1,614 కోట్ల పెట్టుబడులు తరలిపోవడానికి విజయ్ సర్కార్ ఫెయిల్యూరే కారణమంటూ డీఎంకే పార్టీ అటాక్ స్టార్ట్ చేస్తుంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం సీరియస్ యాక్షన్‌కు దిగిందన్న టాక్ వైరల్ అవుతోంది. తమ పరిశ్రమల శాఖలో 15 మంది అధికారులను తొలగించారనే ప్రచారం కలకలం రేపుతోంది. హ్వేసింగ్, రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థలు ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న నేపథ్యంలో డేటా లీక్ ఆరోపణలు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 15 మంది ఉద్యోగుల తొలగింపుపై అధికారిక ప్రకటన రాకపోవడం ఇంకో డిస్కషన్‌కు దారితీసింది.

అయితే 15 మంది సీనియర్ కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించగా.. అందులో కొందరు ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డులో ఉద్యోగాల్లో చేరిపోయారన్న టాక్ కూడా బయలుదేరింది. కొత్త పరిశ్రమలతో చర్చలు, ఇన్వెస్టర్లతో డిస్కషన్స్‌, కంపెనీలకు అనుమతులు, సౌకర్యాల కల్పనలో.. తమిళనాడు ప్రభుత్వ అధికారిక పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థగా ఉన్న గైడెన్స్‌ అనే నోడల్ ఏజెన్సీ కీలకంగా పనిచేస్తుంది. డేటా లీకేజీ ఆరోపణలతో గైడెన్స్ నోడల్ ఏజెన్సీ నుంచి 15 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌ను తప్పించారనే ప్రచారం జరుగుతోంది.

డేటా లీక్ ఆరోపణలతో ఏపీ, తమిళనాడు మధ్య పారిశ్రామిక పెట్టుబడుల పోటీ కొత్త మలుపు తిరిగింది. తమిళనాడు పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న గైడెన్స్ నోడల్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. ఆ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల సమాచారాన్ని ఏపీకి చేరవేస్తున్నారన్న అలిగేషన్స్‌ తమిళ్‌ పాలిటిక్స్‌లో రచ్చ చేస్తున్నాయి. అందుకే తమిళనాడుకు రావాల్సిన రూ.1,614 కోట్ల విలువైన పెట్టుబడులు ఏపీకి తరలిపోయాయని డీఎంకే.. సీఎం విజయ్‌ని టార్గెట్ చేస్తుందట. అయితే డేటా లీకేజీకి బాధ్యులను చేస్తూ 15 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని తమిళనాడు పరిశ్రమలశాఖ అధికారులు కొట్టి పడేస్తున్నారు.

అయితే లేటెస్ట్‌గా ఏపీలోని చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టేందుకు కొందరు పారిశ్రామిక వేత్తలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో ప్రధానంగా కొరియన్ ఫుట్ వేర్ దిగ్గజం హ్వేసింగ్ రూ.898 కోట్లతో కుప్పంలో యూనిట్ పెట్టాలని నిర్ణయించిందట. తిరుపతి జిల్లా సత్యవేడులో రూ.2,200 కోట్లతో రాయల్ ఎన్ ఫీల్డ్, అనంతపురం జిల్లాలో మరికొన్ని పరిశ్రమలు పెడుతున్నారట. ఈ పరిశ్రమల ప్రతినిధులు ముందుగా తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి.. ఆ తర్వాత ఏపీలో పెట్టుబడులు పెట్టడంతో.. తమిళనాడులోని గైడెన్స్ ఏజెన్సీ నుంచి డేటా లీకేజ్ అయిందన్న అనుమానం తెరమీదకు వచ్చిందటున్నారు. దీంతో తమిళనాడుకు వస్తాయని భావించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఏపీకి తరలిపోవడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీసిందంటున్నారు.

తమతో సంప్రదింపుల ప్రక్రియ జరుగుతుండగానే, ఏపీ ప్రభుత్వంతో సదరు సంస్థలు ఒప్పందం చేసుకోవడం వెనుక ఏం జరిగిందని తెలుసుకోగా.. పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న 15 మంది డేటా లీక్ చేశారన్న విషయం బయటపడిందని అంటున్నారు. దీంతో వారిపై వేటు వేశారని చెబుతున్నారు. అయితే తమిళనాడులోని గైడెన్స్ సంస్థ నుంచి బయటకు వెళ్లినవారు వెంటనే ఏపీ ప్రభుత్వంలో చేరినట్లు జరుగుతున్న ప్రచారం మరింత వేడి పుట్టిస్తోంది.

అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి డేటా సేకరించలేదని.. పెట్టుబడులకు తమ స్టేట్‌ అనుకూలంగా ఉండటం వల్లే ఇన్వెస్టర్లు తరలివస్తున్నారని చెబుతోంది. తమిళ్‌ పాలిటిక్స్‌లో మాత్రం డైలాగ్ వార్ నడుస్తోంది. అయితే ఈ ఫైట్ అంత తమిళనాడులో పొలిటికల్ ఫైట్‌కు దారితీయొచ్చు కానీ..ఏపీకి పెట్టుబడులు రాబట్టడంలో సీఎం చంద్రబాబు తన మార్క్ అడ్మినిస్ట్రేషన్..ఇన్షియేషన్‌ ఏంటో చూపిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.