30 మంది : వైసీపీ అధికార ప్రతినిధులు వీరే

Submitted on 20 October 2019
ysrcp official spokes persons

ఏపీ ప్రభుత్వం అధికార ప్రతినిధులను నియమించింది. 30 మందితో జాబితాను విడుదల చేసింది. వైసీపీ చీఫ్, సీఎం జగన్ ఆదేశాలతో కొత్త అధికార ప్రతినిధుల జాబితాను రిలీజ్ చేశారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని అన్ని కులాలకు చెందిన నేతలకు అధికార ప్రతినిధులుగా అవకాశం కల్పించారు. రెడ్డి, కాపు, కమ్మ, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఇకపై పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను అధికార ప్రతినిధులు మీడియా సమావేశాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. టీవీ ఛానళ్లలో చర్చలకు కూడా వారే హాజరవుతారు. రాష్ట్ర, జాతీయ వ్యవహారాలపై ప్రకటనలు జారీ చేస్తారు.

గతంలో అధికార ప్రతినిధులను ప్రకటించినప్పటికీ ఆ జాబితాను సవరిస్తూ తాజాగా 30 మందితో కూడిన జాబితాను వైసీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. సీనియర్‌ నేతలతో పాటు ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్యేలకు కూడా అధికార ప్రతినిధులుగా అపాయింట్ చేశారు. జాబితాలో ముగ్గురు మాజీ మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. పార్టీ పదవుల్లోనూ జగన్ సామాజిక న్యాయం పాటించారని సంకేతాల ఇచ్చే దిశగా ఈ జాబితా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.

అధికార ప్రతినిధులు వీరే:
1. గడికోట శ్రీకాంత్‌రెడ్డి
2. ధర్మాన ప్రసాదరావు
3. ఆనం రామనారాయణరెడ్డి
4. కె.పార్థసారధి
5. అంబటి రాంబాబు
6. జోగి రమేష్‌
7. మల్లాది విష్ణు
8. భూమన కరుణాకర్‌రెడ్డి
9. కాకాణి గోవర్ధన్‌రెడ్డి
10. గుడివాడ అమర్‌నాథ్‌
11. మహమ్మద్‌ ఇక్బాల్‌
12. ఉండవల్లి శ్రీదేవి
13. విడదల రజని
14. మేరుగ నాగార్జున
15. తెల్లం బాలరాజు
16. రాజన్న దొర
17. అదీప్‌ రాజ్‌
18. అబ్బయ్య చౌదరి
19. నారమల్లి పద్మజ
20. సిదిరి అప్పలరాజు
21. కిలారు రోశయ్య
22. జక్కంపూడి రాజా
23. బత్తుల బ్రహ్మానందరెడ్డి
24. కాకమాను రాజశేఖర్‌
25. అంకంరెడ్డి నారాయణమూర్తి
26. నాగార్జున యాదవ్‌
27. రాజీవ్‌ గాంధీ
28. కె.రవి చంద్రారెడ్డి
29. ఈద రాజశేఖర్‌రెడ్డి
30. పి.శివశంకర్‌రెడ్డి

Ysrcp
cm jagan
official spokes persons

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు