కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

Submitted on 15 March 2019
YS Vivekananda Reddy dead body post-mortem completed

వైఎస్ వివేకానందరెడ్డికి పోస్టుమార్టం పూర్తయ్యింది. పులివెందుల రిమ్స్ వైద్యులు ఆధ్వర్యంలో జరిగింది. ఆ తర్వాత భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. వివేకా శరీరంపై బలమైన గాయాలను గుర్తించారు వైద్యులు.  తల వెనక, నుదుటిపై కత్తిగాట్లు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించినట్లు తెలుస్తోంది. చేతిపైన కూడా పెద్ద గాయం ఉంది. బాత్ రూమ్ లో ఉన్న మృతదేహం రక్తపు మడుగులో కనిపించిన విషయం తెలిసిందే.. బెడ్ రూమ్ లో కూడా రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వివేకాది సహజ మరణం కాదన్న అనుమానాలు వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు.. పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసులు కూడా అనుమానాలు నివృతి చేయాలంటూ పోస్టుమార్టం డాక్టర్లకు లేఖ రాశారు.
Read Also: వివేకా హత్య : ఆరోపణలు రుజువైతే నడిరోడ్డు పై కాల్చేయండి

పోస్టుమార్టంలో షాకింగ్ విషయాలు : వివేకానందరెడ్డి తల వెనక భాగంలో భారీ కత్తిపోటు ఉన్నట్లు చెబుతున్నారు. నుదుటపైనా రెండు లోతైన గాయాలు ఉన్నాయి. తొడపైనా గాయం ఉంది. శరీరంపై మొత్తం ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి. డాక్టర్ల ప్రాథమిక నిర్థారణ ఆధారంగా పోలీసులు హత్యగా నిర్థారించారు. ఆ కోణంలోనే విచారణ చేపట్టారు.. కేసు నమోదు చేశారు. శరీరంపై కత్తిగాట్లు ఉండటం.. అవి కూడా లోతుగా ఉండటంతో.. బలంగా దాడి జరిగిందని అంటున్నారు పోలీసులు.

వివేకానందరెడ్డిది హత్యగా నిర్థారణ కావటంతో.. పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు భారీగా చేరుకున్నారు. కార్యకర్తలు కూడా ఆవేశంగా ఉన్నారు. ఇక వివేకానందరెడ్డిని చంపింది ఎవరు.. ఎందు కోసం చంపారు.. ఎలా చేశారు అనేది విచారణలో తేలాల్సి ఉంది. 
Read Also: వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

ys vivekanda reddy
dead body
post-mortem
complete
kadapa

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు