బాత్రూంలో ఏం జరిగింది : వివేకానందరెడ్డి మృతిలో 5 అనుమానాలు

Submitted on 15 March 2019
YS Vivekananda Reddy Passes Away 5 Suspicions

వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వివేక కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టంలో ఈ ఐదు అనుమానాలకు క్లారిటీ ఇవ్వాలని కూడా పోలీసులు.. డాక్టర్లను కోరారు. విచారణ నిష్పక్షపాతికంగా జరగాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులను కోరారు.
Read Also: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు

2019, మార్చి 15 తేదీ శుక్రవారం పులివెందులలోని ఆయన నివాసంలోని బాత్రూంలో వైఎస్ వివేక  రక్తపు మడుగులో పడి ఉన్నారు. గుండెపోటుతో చనిపోయారని మొదట వార్తలు వచ్చినా.. ఆ తర్వాత శరీరంపై ఉన్న గాయాలతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అనుమానం ఒకటి : బాత్ రూంలో రక్తపు మడుగులో పడి ఉండడం. 
అనుమానం రెండు : బెడ్ రూం దగ్గర రెండు లీటర్ల రక్తం ఉండడం. 
అనుమానం మూడు : వివేకనందరెడ్డి తలపై గాయం ఉండడం. 
అనుమానం నాలుగు : తల వెనక భాగంలోనూ గాయం ఉంది.
అనుమానం ఐదు :  అరచేతిపై బలమైన గాయం ఉంది.

ఈ ఐదు అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు కుటుంబ సభ్యులు కంప్లయింట్ చేశారు. పోస్టుమార్టం అనంతరం వైఎస్ వివేకానందరెడ్డి ఎలా మృతి చెందారు అనే దానిపై క్లారిటీ వస్తుంది.

ys vivekananda reddy
Passes
5 Suspicions
pulivendula

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు