వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై సిట్ దర్యాప్తు

Submitted on 15 March 2019
ys vivekananda reddy death sit issued for investigation

రాష్ట్రమంతా ఎన్నికల ఫీవర్‌లో మునిగి ఉండగా శుక్రవారం ఉదయం బయటికొచ్చిన వివేకానంద రెడ్డి మరణ వార్త కడప జిల్లాలో అలజడి సృష్టిస్తోంది. బాత్రూమ్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బెడ్ రూమ్‌లోనూ రక్తపు మరకలు ఉండడంతో అందరి అనుమానాలు బలపడ్డాయి. 

పోస్టు మార్టం అనంతరం హత్యేనని నిర్దారణ అవడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు విచారణకై సిట్ ఏర్పాటు చేసింది. సిట్‌లో 5 పోలీసు బృందాలు పనిచేయనున్నాయి. తక్షణం న్యాయవిచారణ చేపట్టాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు పంపారు. సిఐడీ విభాగం అడిషనల్ చీఫ్.. అజిత్ గార్గ్ నేతృత్వంలో దర్యాప్తు జరగనుంది. పోలీసులకు కొన్ని కొత్త వ్యక్తుల వేలిముద్రలు కనిపించినట్లు చెబుతున్నారు. మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో క్లూస్ టీం పని చేస్తోంది. 
Read Also: కత్తితో నరికారు : వివేకానందరెడ్డిని చంపేశారు

నుదుటిపై ఇంతబలమైన గాయాలు కనిపిస్తున్నా.. గుండెపోటు అని చెప్పడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. డాగ్ స్క్వాడ్ కూడా ఆయన ఇంటి చుట్టే తిరిగినట్లు పోలీసులు తెలిపారు. వివేకానందరెడ్డి తల వెనక భాగంలో భారీ కత్తిపోటు ఉన్నట్లు చెబుతున్నారు. నుదుటపైనా రెండు లోతైన గాయాలు ఉన్నాయి. తొడపైనా గాయం ఉంది. శరీరంపై మొత్తం ఏడు చోట్ల కత్తిగాట్లు ఉన్నాయి. డాక్టర్ల ప్రాథమిక నిర్థారణ ఆధారంగా పోలీసులు హత్యగా నిర్థారించారు. 

వస్త్రాలు కప్పి ఉంచి సహజ మరణమేనని చెప్పడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా సహజ మరణంగానే చిత్రీకరించాలని భావించారా.. లేదా ప్రభుత్వ అధికారుల నుంచే విషయం బయటికి రావాలని ఆపి ఉంచారాననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 
Read Also: వైఎస్ వివేకా మృతి : అభ్యర్థుల ప్రకటన వాయిదా

ys vivekanda reddy
ys vivekananda reddy die

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు