నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు

Submitted on 19 August 2019
youngster-turned-nano-car-helicopter

ఓ యువకుడు నానో కారును హెలికాప్టర్ గా మార్చేశాడు. బీహార్‌లోని సిమరీ గ్రామానికి చెందిన ఓ యువకుడు.. సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలనేది కలలుకన్నాడు. కానీ అంతటి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు.

ఏడు నెలలపాటు శ్రమించి తయారు చేసిన ఈ హెలికాప్టర్.. చూడటానికి నిజమైన హెలికాప్టర్‌కు ఏమాత్రం తీసిపోదు. కాకపోతే హెలికాప్టర్‌లా ఇది గాలిలో ఎగరలేదు. రోడ్డుపైనే దూసుకెళ్తుంది. తన సోదరుడితో కలిసి 7 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశాడు.

ఈ వార్త వైరల్ కావడంతో కొందరు నెటిజనులు.. కారును హెలికాప్టర్‌గా మార్చడం నేరమని, ఇది అతనికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం అంటూ బీహార్ పోలీసులకు ట్వీట్ చేశారు.

మరిన్ని తాజా వార్తలు

సంబంధిత వార్తలు